దిశ ఎఫెక్ట్.. ఎర్ర ప‌హ‌డ్ ఎల్లో డ్రాప్స్ పై క‌దిలిన పొల్యూష‌న్ బోర్డు

by Nallavelli.Anjaneyulu |

ఎర్రపహడ్ పసుపు చుక్కల మిస్టరీ పై దిశ దిన పత్రిక పోరాటం ఫలించింది. వరుస కథనాలతో యంత్రాంగం నిద్రమత్తు వీడి ఎర్రపహడ్ ఒక్కొక్కరుగా గ్రామాన్ని చేరుకుంటున్నారు.

దిశ ఎఫెక్ట్.. ఎర్ర ప‌హ‌డ్ ఎల్లో డ్రాప్స్ పై క‌దిలిన పొల్యూష‌న్ బోర్డు
X

దిశ,​ తాడ్వాయి : ఎర్రపహడ్ పసుపు చుక్కల మిస్టరీ పై దిశ దిన పత్రిక పోరాటం ఫలించింది. వరుస కథనాలతో యంత్రాంగం నిద్రమత్తు వీడి ఎర్రపహడ్ ఒక్కొక్కరుగా గ్రామాన్ని చేరుకుంటున్నారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారి తిరుపతి శుక్రవారం ఎర్రపహడ్ గ్రామానికి వచ్చి పరిస్థితిని సమీక్షించారు. ఇళ్లపై, కారుపై పడిన పసుపు చుక్కల శాంపిల్స్‌ను శాస్త్రీయంగా సేకరించారు. అధికారులు ఉన్నప్పుడు ఆగి.. వారు వెళ్లగానే మళ్లీ ప్రత్యక్షమవుతున్న చుక్కలపై అధికారులు విస్మయం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ ఎల్లో చుక్కలు రసాయనాలా? లేక కీటకాల వల్లే జరుగుతుందా? వేరే ఇత‌ర ఏమైనా కార‌ణాలు ఉన్నాయా..? నిజం ల్యాబ్ రిపోర్టుతో తేలనుంది.​ గత నెల రోజులగా ఐదవ కాలానివాసులు ఆందోళనకు గురవుతున్న ఎల్లో డ్రాప్ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లిన దిశ పత్రికపై గ్రామస్థులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Next Story