- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దిశ ఎఫెక్ట్.. ఫర్టిలైజర్ వ్యాపారుల అలర్ట్..
జీరో మాల్, నిషేధిత మందుల విక్రయాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన కామారెడ్డి ఫర్టిలైజర్ దుకాణాల యజమానులు అలర్ట్ అయ్యారు.

దిశ, కామారెడ్డి : జీరో మాల్, నిషేధిత మందుల విక్రయాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన కామారెడ్డి ఫర్టిలైజర్ దుకాణాల యజమానులు అలర్ట్ అయ్యారు. "దిశ" పత్రికలో గత మూడు రోజులుగా వస్తున్న వరుస కథనాలతో వారు అలర్ట్ అయ్యారు. తాము చేస్తున్న జీరో వ్యాపారంతో పాటు నిషేధిత పురుగుమందులు, గడ్డి మందులు ఎక్కడ బయటపడతాయోనని గ్రహించిన వ్యాపారులు వాటిని అండర్ గ్రౌండ్ కు తరలించినట్లుగా తెలుస్తోంది. దుకాణాలతో పాటు వారికి చెందిన గోదాంలలో కూడా జీరో మాల్, నిషేధిత మందులు నిల్వ ఉండకుండా అండర్ గ్రౌండ్ కు తరలించి క్లీన్ చేసినట్లుగా సమాచారం. అంతేకాకుండా ప్రస్తుతం ఉన్న స్టాక్ వివరాలను రిజిస్టర్లలో నమోదు చేస్తూ అక్రమాన్ని సక్రమంగా చేసుకుంటున్నట్లుగా సమాచారం.
అధికారులు దాడులు చేస్తారనే భయంతోనేనా...
నిన్న మొన్నటి వరకు కామారెడ్డి జిల్లా కేంద్రంలో యదేచ్చగా సాగిన జీరో మాల్, నిషేధిత పురుగు మందులు, గడ్డి మందుల విక్రయాలు, ఎరువుల బస్తాలకు పురుగుమందులు లింకు పెడుతూ అధిక ధరలకు ఎరువులు విక్రయిస్తూ రైతులను నిలువు దోపిడి చేస్తున్నారని "దిశ" పత్రికలో వస్తున్న "వ్యాపారుల సిండికేట్" వరుస కథనాలతో ఆందోళన చెందిన ఫర్టిలైజర్ వ్యాపారులు అలర్ట్ అయ్యారు. ఈ కథనాలతో స్పందించిన అధికారులు షాపులపై దాడులు చేస్తే తమ అక్రమ వ్యాపారం ఎక్కడ బయటపడుతుందోనని ఆందోళన చెంది ముందస్తుగా జీరో మాల్ ను, నిషేధిత మందులను అండర్ గ్రౌండ్ కు తరలించారని సమాచారం.
అధికారులే ముందస్తు సమాచారం ఇచ్చారా...
సిండికేట్ వ్యాపారంపై "దిశ "లో వస్తున్న వరుస కథనాలతో ఏ క్షణమైనా తాము, లేదంటే ఉన్నతాధికారులే వచ్చి దాడులు నిర్వహించే అవకాశాన్నాయని, ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవాలంటూ ఫర్టిలైజర్ వ్యాపారులకు అధికారులే ఉప్పందించినట్లుగా తెలుస్తోంది. స్థానికంగా ఉంటూ వ్యాపారులతో సత్సంబంధాలు కొనసాగించే వారే వ్యాపారులకు ఈ విషయమై ఉప్పందించినట్టుగా సమాచారం. దీంతోనే వ్యాపారులు అంతా అలర్ట్ అయినట్టుగా తెలుస్తోంది.
అధికారుల జాడేది..
వరుస కథనాలతో తమ షాపులపై అధికారులు ఎక్కడ దాడులు చేస్తారోనని వ్యాపారులు ఆందోళన చెందుతున్నప్పటికీ అధికారుల్లో మాత్రం ఎలాంటి చలనం లేకపోవడం పట్ల అనుమానాలు కలుగుతున్నాయి. అసలు జిల్లాలో వ్యవసాయ అధికారులు ఉన్నారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అక్రమ వ్యాపారాలపై ఉక్కుపాదం మోపాల్సిన అధికారులే వ్యాపారులకు పరోక్షంగా సహకరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దిశ పత్రికలో వాస్తవాలు ప్రచురితం అవుతున్న అధికారులు ఎక్కడున్నారని సామాన్య ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి సిండికేట్ గా ఏర్పడిన ఫర్టీలైజర్ వ్యాపారులపై చర్యలు తీసుకుంటారా.. మాకెందుకులే నష్టపోయేది రైతులే కదా అని వదిలేస్తారా అనేది వేచి చూడాలి.






