ఎల్లారెడ్డిలో అభివృద్ధి పండగ

by Nallavelli.Anjaneyulu |

ఎల్లారెడ్డి పురపాలక సంఘాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని నియోజకవర్గ ఎమ్మెల్యే కె. మదన్మోహన్ రావు పేర్కొన్నారు.

ఎల్లారెడ్డిలో అభివృద్ధి పండగ
X

దిశ, తాడ్వాయి(​ఎల్లారెడ్డి) : ఎల్లారెడ్డి పురపాలక సంఘాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని నియోజకవర్గ ఎమ్మెల్యే కె. మదన్మోహన్ రావు పేర్కొన్నారు. బుధవారం మున్సిపల్ పరిధిలో సుమారు రూ. 24 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పలు భారీ అభివృద్ధి పనులకు ఆయన స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి శంకుస్థాపనలు చేశారు.​ మున్సిపల్ పరిధిలో ఎమ్మెల్యే పర్యటన ఉత్సాహంగా సాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిధుల వివరాలను వెల్లడించారు. రూ. 4 కోట్లతో మున్సిపాలిటీలో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం,5వ వార్డులో రూ. 5 కోట్లతో అత్యాధునిక షాపింగ్ కాంప్లెక్స్, రూ. 3 కోట్లతో మినీ ట్యాంక్ బండ్ (పెద్ద చెరువు) వద్ద మల్టీ జనరేషన్ పార్క్, రూ. 10 కోట్లతో సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ కార్యాలయానికి కొత్త హంగులు, 11వ వార్డులో రూ. 2 కోట్లతో నూతన రోడ్ల నిర్మాణం. మున్సిపాలిటీలో విలీనమైన లింగారెడ్డిపేట గ్రామాభివృద్ధి పై ఎమ్మెల్యే ప్రత్యేక వరాలు ప్రకటించారు. గ్రామంలో ప్రాథమిక పాఠశాల ఏర్పాటుకు ప్రభుత్వం జీవో జారీ చేసిందని, త్వరలోనే పనులు మొదలవుతాయని తెలిపి గ్రామస్తుల్లో హర్షం నింపారు. ఎస్సీ వాడలో అంగన్‌వాడీ కేంద్రం ఏర్పాటుకు హామీ ఇచ్చారు. మున్నూరు కాపు, ముదిరాజ్ సంఘాల భవన మరమ్మత్తుల కోసం చెరో రూ. 5 లక్షల మంజూరు పత్రాలను అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మదన్మోహన్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగట్టారు.పదేళ్లు అధికారంలో ఉండి చేయలేని పనులను, మేము ఏడాదిలోనే చేసి చూపిస్తున్నాం. కొత్త బస్ స్టాండ్,సెంట్రల్ లైటింగ్, ఇందిరమ్మ ఇళ్లు.. ఇవన్నీ కళ్ళ ముందు కనిపిస్తున్న వాస్తవాలు అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దు అని పిలుపునిచ్చారు. ఎల్లారెడ్డిని రాష్ట్రంలోనే నెంబర్-1 నియోజకవర్గంగా మార్చడమే తన లక్ష్యమని ఆయన పునరుద్ఘాటించారు.

Next Story