- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పారిశుధ్య వారోత్సవాలను పకడ్బందీగా చేపట్టాలి : జాన్ వెస్లీ
సీజనల్ వ్యాధుల నివారణకు తెలంగాణ ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటుందని పంచాయతీ రాజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ జాన్ వెస్లీ తెలిపారు.

దిశ, తాడ్వాయి : సీజనల్ వ్యాధుల నివారణకు తెలంగాణ ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటుందని పంచాయతీ రాజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ జాన్ వెస్లీ తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన పారిశుధ్య వారోత్సవాలను అధికారులు, ప్రజాప్రతినిధులు పకడ్బందీగా చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమాలు ఈ నెల23 వరకు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. పారిశుధ్య వారోత్సవాలలో భాగంగా బుధవారం జాన్ వెస్లీ కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలంలోని ఎర్రపహడ్ గ్రామంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన గ్రామంలోని అన్ని వార్డులను తిరిగి పరిశీలించారు. సీజనల్ వ్యాధులను కలిగించే శానిటేషన్, డంపింగ్ యార్డ్, శ్మశానవాటిక, రోడ్లు డ్రైనేజీ, దోమల నివారణ, లార్వా ఉత్పత్తికి కారణమయ్యే నీటి నిల్వల తొలగింపు, ఇంటింటి నుండి గార్బేజ్‌ను సేకరించడం, వందశాతం నివాసితులు చెత్తను స్వచ్ఛ ట్రాక్టర్లకు అందించడం, తడి, పొడి చెత్తగా విడదీసి అందించడం, నీటిని వృథా చేయకపోవడం, ప్లాస్టిక్ నిషేదం, బహిరంగ స్థలాల్లో చెత్తను వేయకుండా నిరోధించడం తదితర అంశాలను ఆయన క్షేత్రస్థాయి పరిశీలించారు. ఆయన వెంట డీపీఓ శ్రీనివాస్, డీఎల్పీఓ సాయిబాబా, ఎంపీఓ హెప్సిబా, సర్పంచ్ బుక్క నర్సారెడ్డి, ఉపసర్పంచ్ పడమటి బాలాజీ తదితరులు ఉన్నారు.
- Tags
- John Wesley






