- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జుక్కల్‌లో కాంగ్రెస్ జైత్రయాత్ర!
దిశ, నిజాంసాగర్: రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి,ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇన్ చార్జి మంత్రి సీతక్క ను జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు, కామారెడ్డి డీసీసీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు

దిశ, నిజాంసాగర్: రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి,ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇన్ చార్జి మంత్రి సీతక్క ను జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు, కామారెడ్డి డీసీసీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు.హైదరాబాద్‌లోని మంత్రి నివాసంలో జరిగిన ఈ భేటీలో వారు మంత్రికి 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. గ్రామ పంచాయతీ ఎన్నికల విజయంపై ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో జుక్కల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అద్భుత విజయం సాధించడంపై మంత్రి సీతక్క ప్రత్యేకంగా అభినందించారు.నియోజకవర్గంలోని 77 శాంతం స్థానాలను కైవసం చేసుకొని కాంగ్రెస్ జెండా ఎగురవేయడం ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు నాయకత్వానికి, కృషికి నిదర్శనమని ఆమె కొనియాడారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యేను శాలువాతో సన్మానించారు. పార్టీ బలోపేతంపై దిశానిర్దేశం నూతనంగా బాధ్యతలు చేపట్టిన డిసిసి అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ కూడా మంత్రి అభినందిస్తూ,జిల్లాలో పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయాలని సూచించారు. సర్పంచ్ ఎన్నికల స్పూర్తితో రాబోయే మున్సిపల్,ఎంపీటీసీ,జడ్పీటీసీ ఎన్నికల్లో కూడా ఇదే తరహా ఫలితాలను సాధించి విజయఢంకా మోగించాలని మంత్రి ఆకాంక్షించారు. ఈ భేటీతో జుక్కల్ నియోజకవర్గంతో పాటు కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది.మంత్రి ప్రశంసలు తమ బాధ్యతను మరింత పెంచాయని ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సాయి పటేల్ ఉన్నారు.






