- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పాఠశాలలో కంప్లైంట్ బాక్సులు ఏర్పాటు
మండలంలోని కోనాపూర్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల కోసం ఫిర్యాదు బాక్సులు ఏర్పాటు చేశారు.

దిశ, కమ్మర్‌పల్లి: మండలంలోని కోనాపూర్ ఉన్నత పాఠశాలలో బాలికా సాధికారత, కౌమార రక్షణ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థుల ఈవ్ టీజింగ్, ఇతర సమస్యల కోసం, మధ్యాహ్నం భోజన పథకంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల కోసం ఫిర్యాదు బాక్సులు ఏర్పాటు చేసినట్లు ప్రధానోపాధ్యాయులు చౌడారపు రాంప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్లబ్ ఆధ్వర్యంలో ప్రతి శుక్రవారం కంప్లైంట్ బాక్సులు తెరిచి సమస్య పరిష్కరిస్తామని తెలిపారు. పాఠశాల స్థాయిలో పరిష్కరించే సమస్యలు సంబంధిత తల్లిదండ్రులకు తెలిపి పరిష్కరించడం జరుగుతుందని, తీవ్రమైన సమస్యలు కమ్మర్‌పల్లి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పరిష్కరిస్తామని వెల్లడించారు. విద్యార్థుల తమ పేర్లు రాయకుండా సమస్యలు రాసి రహస్యంగా బాక్స్‌లో వేసే ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.
- Tags
- nizamabad






