ఎక్క‌డున్నా ఇంటికి రా బిడ్డ‌.. మావోయిస్టు తండ్రి ర‌వి

by Ratna Kumari |

దిశ, మాచారెడ్డి : బిడ్డా.. రవి ఇంటి కి రా! అని శుక్రవారం డీజీపీ ఎదుట లొంగిపోయిన మావోయిస్టు పార్టీ డివిజనల్ కమిటీ

ఎక్క‌డున్నా ఇంటికి రా బిడ్డ‌.. మావోయిస్టు తండ్రి ర‌వి
X

దిశ, మాచారెడ్డి : బిడ్డా.. రవి ఇంటి కి రా! అని శుక్రవారం డీజీపీ ఎదుట లొంగిపోయిన మావోయిస్టు పార్టీ డివిజనల్ కమిటీ మెంబర్ ఎర్రగొల్ల రవి అలియాస్ సంతోష్ తండ్రి రామయ్య భావోద్వేగానికి గురయ్యారు. ముదిమి వయసులో ఉన్న రవి తండ్రిని 'దిశ ' కదిలించింది. 24 ఏళ్ల పాటు అజ్ఞాతంలో గడిపిన రవి మావోయిస్టు పార్టీ మనుగడ కు ముప్పు వాటిల్లిన నేపథ్యంలో ఆయన లొంగిపోయారు. ఈ సందర్భంగా అతని తండ్రి రామయ్య నిన్ను చూడాలని ఉంది. 24 ఏళ్లుగా కళ్లకు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నా.. తల్లి నీ చూపులకు నోచుకోకుండానే కానరాని లోకాలకు వెళ్లిపోయింది. తనువు చాలించే వయసులో ఉన్న నేను నిన్ను చూడాలని ఆశగా ఉంది. ప్రతి ఎన్ కౌంట‌ర్, లొంగుబాటు, అరెస్టు వార్తల్లో ఎక్కడ నీ పేరు పలుకుతుందోనని ఆందోళనతో నిద్ర లేని రాత్రులు ఎన్నో గడిపాను. నా ఎదురు చూపులు ఫలించాయి. లొంగిపోయిన వారిని పోలీసులు వారి సొంత గ్రామాలకు పంపించరు అని అంటున్నారు. పోలీసుల నుంచి అలాంటి పరిస్థితులేమైనా ఎదురైతే నన్ను చూడడానికైనా ఒక్కసారి వచ్చిపో బిడ్డా! అని భావోద్వేగానికి లోనయ్యారు.

Next Story