- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సెల్ ఫోన్ దొంగ అరెస్ట్.. రిమాండ్
by Ratna Kumari |
దిశ, నిజామాబాద్ అర్బన్ : నిజామాబాద్ నగరంలోని ద్వారకా నగర్ కు చెందిన సయ్యద్ మాజిద్ అనే ఓ సెల్ ఫోన్ దొంగను గురువారం అరెస్ట్ చేసినట్లు రైల్వే ఎస్ఐ హెచ్.

X
దిశ, నిజామాబాద్ అర్బన్ : నిజామాబాద్ నగరంలోని ద్వారకా నగర్ కు చెందిన సయ్యద్ మాజిద్ అనే ఓ సెల్ ఫోన్ దొంగను గురువారం అరెస్ట్ చేసినట్లు రైల్వే ఎస్ఐ హెచ్. సాయిరెడ్డి తెలిపారు. గురువారం సాయంత్రం రైల్వే ప్లాట్ ఫాంపై పెట్రోలింగ్ చేస్తుండగా ఓ వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించడంతో ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా, బుధవారం రాత్రి ట్రైన్ లో ఫోన్ దొంగతనం చేసినట్లు తెలిపాడు. మళ్లీ గురువారం కూడా దొంగతనం చేసే ఉద్దేశంతో రైల్వే స్టేషన్ కు వచ్చినట్లు రైల్వే పోలీసుల విచారణలో ఒప్పుకున్నట్లు ఎస్ఐ తెలిపారు. నిందితుడిపై గతంలో కూడా రెండు దొంగతనం కేసులు నమోదై ఉన్నట్లు తమ విచారణలో తేలిందని, ఫోన్ రికవరీ చేసి నిందితుడిని రిమాండ్ కు తరలించినట్లు రైల్వే ఎస్ఐ సాయిరెడ్డి తెలిపారు.
Next Story






