గుండెపోటుతో బీఆర్ఎస్ నేత మృతి

by Gopi |
గుండెపోటుతో బీఆర్ఎస్ నేత మృతి
X

దిశ, నిజామాబాద్ క్రైం: నిజామాబాద్ నగరంలోని న్యాల్ కల్ రోడ్డులోని ఓ ప్రార్థన మందిరం వద్ద పూజ కోసం వేళ్లిన బీఆర్ఎస్ నేత గుండేపోటుతో మృతిచెందాడు. మంగళవారం హోళీ పండుగ సందర్భంగా ఉదయం పూజ కోసం మచల్ శ్రీనివాస్(41) తన కూతురుతో పాటు గుడికి వేళ్లగా అక్కడ అతడు కుప్ప కులిపోయాడు. సీపీఆర్ చేసిన కోలుకోకపోవడంతో అతడిని హుటాహుటిన ప్రైవేట్ ఆసుపత్రికి తరలించిన అతను అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. శివాజీ నగర్ కు చెందిన మచల్ శ్రీనివాస్ ప్రస్తుతం రెడియో స్టేషన్ ప్రాంతంలో నివాసం ఉంటు జూనియర్ న్యాయవాదిగా పనిచేస్తూ బీఆర్ఎస్ లో పని చేస్తున్నారు. అఖిల భారతీయ సఫాయి మజ్ధూర్ సంఘం నాయకుడుగా ఉన్నారు. గతంలో బీజేపీలో వివిధ పదవులలో కొనసాగి 2018 అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టిలో చేరారు. మచల్ శ్రీనివాస్ కు భార్య, కూతురు ఉన్నారు.

Next Story