ఈత నేర్చుకోవడానికి వెళ్లి బాలుడి మృతి

by Bhanu |

ఈత నేర్చుకోవడానికి వెళ్లి బాలుడి మృతి చెందిన ఘటన వర్ని మండలం,సిద్ధాపూర్ లో చోటుచేసుకుంది.

ఈత నేర్చుకోవడానికి వెళ్లి బాలుడి మృతి
X

దిశ: బాన్సువాడ : ఈత నేర్చుకోవడానికి వెళ్లి బాలుడి మృతి చెందిన ఘటన వర్ని మండలం,సిద్ధాపూర్ లో చోటుచేసుకుంది. వర్ని మండలం,సిద్దాపూర్ గ్రామానికి చెందిన 13 సంవత్సరాల బాలుడు బర్దవాల్ తాన్ సింగ్ S/o రామ్ చంద్ అను అబ్బాయి ఈరోజు ఉదయం స్నేహితులతో కలిసి గ్రామ శివారులోని బావిలో ఈత నేర్చుకోవడానికి వెళ్లి ప్రమాదవశాత్తు నీళ్లలో మునిగి చనిపోయినాడు. నీళ్లు ఎక్కువగా ఉండడం తో నీట మునిగి మృతి చెందినట్లు తెల్సింది. ఈ విషయంలో బాలుడు తండ్రి రామచంద్ వర్ని పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్.ఐ. మహేష్ తెలిపారు.

ఈ సందర్భంగా ఎస్.ఐ. మహేష్ మాట్లాడుతూ వర్ని మండల ప్రజలకు తెలియజే యునది ఏమనగా ప్రస్తుతం వేసవి కాలం సందర్భంగా పిల్లలు బావులలో గాని కాలువలలో గాని ఈత నేర్చుకోవడానికి వెళ్లడం జరుగుతుంది కావున పిల్లలను పెద్దల పర్యవేక్షణలో అలాగే ఈత నేర్పే నిష్ణాతులు పర్యవేక్షణలో మాత్రమే ఈత నేర్చుకోవడానికి పంపాలని వర్ని మండల ప్రజలను కోరారు.

Next Story