ఆటో.. బైక్ ఢీ.. ఒకరి మృతి..

by Bhanu |   (  Updated:2025-04-27 14:35:55  IST  )

మండల కేంద్రంలోని సాయి నగర్ దగ్గరలో ఉన్న పెట్రోల్ బంకు సమీపంలో ఆదివారం సాయంత్రం ఆటో బైక్ ఢీ కొని ఒకరు మృతి చెందినట్లు సిఐ వెంకటేశ్వరరావు తెలిపారు.

ఆటో.. బైక్ ఢీ.. ఒకరి మృతి..
X

దిశ, బోథ్: మండల కేంద్రంలోని సాయి నగర్ దగ్గరలో ఉన్న పెట్రోల్ బంకు సమీపంలో ఆదివారం సాయంత్రం ఆటో బైక్ ఢీ కొని ఒకరు మృతి చెందినట్లు సిఐ వెంకటేశ్వరరావు తెలిపారు.ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ బోథ్ నుండి ధన్నూర్ వెళుతున్న మోటార్ సైకిల్ అదిలాబాద్ నుండి బోథ్ కు వస్తున్న ఆటో ఢీ కొనడంతో మోటార్ సైకిల్ పై ఉన్న ముసుకు రాకేష్ రెడ్డి, ముద్ధం రాజు లకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు, పోలీసులు గాయపడ్డ వారిని అంబులెన్సులో బోథ్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ ప్రాథమిక చికిత్స చేసిన అనంతరం వైద్యుల సూచనల మేరకు మెరుగైన వైద్యం కోసం నిర్మల్ కు తరలిస్తుండగా మార్గమధ్యలో ముసుకు రాకేష్ రెడ్డి మరణించినట్లు తెలిపారు. ప్రమాదం జరిగిన సంఘటన స్థలాన్ని సిఐ వెంకటేశ్వరరావు, ఎస్ఐ ప్రవీణ్ కుమార్ సందర్శించి ప్రమాదానికి గల కారణాలను తెలుసుకున్నారు.

Next Story