బైక్ పెట్రోల్ ట్యాంక్ కవర్ లో నుంచి రూ. 2 లక్షల నగదు చోరీ

by Nallavelli.Anjaneyulu |

బైక్ పెట్రోల్ ట్యాంకు కవర్ లో నుంచి రూ. రెండు లక్షల నగదు చోరీ చేసిన ఘ‌ట‌న ఎల్లారెడ్డి పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకుంది.

బైక్ పెట్రోల్ ట్యాంక్ కవర్ లో నుంచి రూ. 2 లక్షల నగదు చోరీ
X

దిశ‌, ఎల్లారెడ్డి : బైక్ పెట్రోల్ ట్యాంకు కవర్ లో నుంచి రూ. రెండు లక్షల నగదు చోరీ చేసిన ఘ‌ట‌న ఎల్లారెడ్డి పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకుంది. ఎస్సై మ‌హేష్ తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. ఎల్లారెడ్డి పట్టణ కేంద్రానికి చెందిన అబ్దుల్ షరీద్ తన కూతురు పెళ్లి అవసరాల నిమిత్తం బుధవారం యూనియన్ బ్యాంక్ లో రూ మూడు లక్షలు నగదు డ్రా చేసుకొని ఆ డబ్బులను ఇంటికి వెళ్లే సమయంలో బైక్ పెట్రోల్ కవర్లో పెట్టుకొని వెళ్తుండ‌గా.. దేవునిపల్లి గేటు వద్ద ఉన్న కారంపూడి దుకాణం వద్ద బైకులు ఆపి దుకాణంలోకి వెళ్లి కారంపొడి తీసుకొచ్చాడు. వెంట‌నే బైక్ లో ఉన్న‌ డబ్బులు అని చూడగా ఎవరో గమనించిన గుర్తు తెలియని వ్యక్తులు ట్యాంక్ కవర్ లో ఉన్న మూడు లక్షలలో రెండు లక్షల రూపాయలను గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లినట్లు గమనించాడు. ఈ విషయంపై బాధితుడు ఎల్లారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేయగా ఎస్ఐ మహేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సంఘటన స్థల పరిసర ప్రాంతాల్లో ఉన్న సిసి కెమెరాల ఫుటేజ్ పరిశీలించగా నెంబర్ ప్లేట్ లేని ద్విచక్ర వాహనంపై ఇద్దరు అనుమానితులు ఒక బైకుపై మెదక్ వైపు పారిపోయినట్లు తెలిపారు. ఈ ఘటనపై నిందితులను గుర్తించి పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిన‌ట్టు తెలిపారు.

Next Story