- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పెద్దపులి సంచరిస్తోంది.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
by Ratna Kumari |
దిశ, రాజంపేట : పెద్దపులి సంచరిస్తున్న నేపథ్యంలో రాజంపేట మండలంలోని అటవీ ప్రాంత ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని

X
దిశ, రాజంపేట : పెద్దపులి సంచరిస్తున్న నేపథ్యంలో రాజంపేట మండలంలోని అటవీ ప్రాంత ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ సయ్యద్ బాబా అన్నారు. గత వారం రోజులుగా కామారెడ్డి జిల్లాలోని మాచారెడ్డి, దోమకొండ, అంబరిపేట, పెద్ద మల్లారెడ్డి సంగమేశ్వర్ గ్రామాలలో పెద్దపులి సంచరిస్తూ ఐదు లేగ దూడలను పెద్దపులి చంపింది. పెద్దపులి సంచరిస్తున్నందున రాజంపేట మండలంలో ఫారెస్ట్ కు దగ్గర ఉన్న గ్రామాలు జంతువులను ఇంటి వద్దనే కట్టేయాలని, ఫారెస్ట్ ఏరియాలకి ఎవరూ వెళ్లకూడదని తెలిపారు. మండల ప్రజలు ఫారెస్ట్ అధికారులకు సహకరించాలని ఆయన కోరారు. ఎలాంటి ఆనవాళ్లు కనిపించిన అధికారులకు తెలియజేయాలని ఫారెస్ట్ అధికారులు తెలిపారు.
Next Story






