- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రిన్సిపాల్ పై యువకుడి దాడి..
పాఠశాల ప్రిన్సిపాల్ పై యువకుడు హత్యాయత్నం చేసిన ఘటన భీమ్‌గల్ పట్టణ కేంద్రంలో చోటుచేసుకుంది.

దిశ, భీమ్‌గల్ : పాఠశాల ప్రిన్సిపాల్ పై యువకుడు హత్యాయత్నం చేసిన ఘటన భీమ్‌గల్ పట్టణ కేంద్రంలో చోటుచేసుకుంది. భీమ్‌గల్ పట్టణానికి చెందిన కృష్ణవేణి హై స్కూల్ ప్రిన్సిపాల్ చిట్యాల నర్సయ్య తెలిపిన వివరాల ప్రకారం సోమవారం మధ్యాహ్నం ఒకటిన్నర గంటల సమయంలో భీమ్‌గల్ కు చెందిన మున్నా అలియాస్ పాపడు అనే వ్యక్తి తనకు ఫోన్ చేశాడన్నాడు. వారి పాఠశాలలో పనిచేస్తున్న ఒక మహిళా ఉద్యోగి తన లవర్ అని, ఆమెను బయటకు తనతో పంపాలని బెదిరించాడని అన్నారు. అలా పంపించరాదని ఏవైనా వ్యక్తిగత విషయాలు ఉంటే పాఠశాల బయట చూసుకోవాలని అన్నాను.
దానికి ప్రిన్సిపల్ మీద కోపంతో తాను భోజనానికి వెళుతున్న సమయంలో తన బైక్ ను అడ్డగించి తనను చంపుతా అని బెదిరించాడని తెలిపారు. వెంటనే ఓ పదునైన ఆయుధాన్ని తీసి ప్రిన్సిపల్ పొట్టలో పొడుస్తుండగా ఆయన చేతిని అడ్డంగా పెట్టడంతో, అది తన పొట్టభాగంలో గాయం చేయడంతో పాటు ప్రిన్సిపల్ అరచేతిని చీల్చుకుంటూ అవతలికి వెళ్ళిందన్నారు. అధిక రక్తస్రావంతో ఆయన అరుస్తుండగా చుట్టుపక్కల వారు వచ్చారని, అంతలో నిందితుడు పారిపోయాడన్నారు. ఈ విషయం పై భీమ్‌గల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.






