కేసీఆర్ చేతుల మీదుగా బీఫామ్ అందుకున్న బాజిరెడ్డి గోవర్థన్

by Disha Web Desk 15 |
కేసీఆర్ చేతుల మీదుగా బీఫామ్ అందుకున్న బాజిరెడ్డి గోవర్థన్
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ మాజీ సీఎం కేసీఆర్ చేతుల మీదుగా బీ-ఫామ్ అందుకున్నారు. గురువారం తెలంగాణ భవన్ లో నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధుల సమక్షంలో బాజిరెడ్డి ఎంపీ అభ్యర్థిగా బీ ఫామ్ అందుకున్నారు. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్ లో సీనియర్ పొలిటీషియన్ బాజిరెడ్డి గోవర్ధన్ తొలిసారి పార్లమెంట్ కు పోటీ పడుతున్నారు. శుక్రవారం బాజిరెడ్డి తొలి సెట్ నామినేషన్ దాఖలు చేయనుండగా కేసీఆర్ ఆశిస్సులను తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, రాజ్య సభ సభ్యుడు సురేశ్ రెడ్డి, ఎమ్మెల్యేలు సంజయ్ కుమార్, కల్వకుంట్ల సంజయ్, మాజీ ఎమ్మెల్యేలు గణేశ్ గుప్తా, జీవన్ రెడ్డి, జెడ్పీ చైర్మన్లు విఠల్ రావు, దావ వసంత, అలీం, ప్రభాకర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed