బాప్ ఏక్ నెంబర్.. బేటా దస్ నెంబర్ వలె ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తీరు..

by Disha Web Desk 20 |
బాప్ ఏక్ నెంబర్.. బేటా దస్ నెంబర్ వలె ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తీరు..
X

దిశ, ఆర్మూర్ : బాప్ ఏక్ నెంబర్ .. బేటా దస్ నెంబర్ వలె ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి తీరు ఉందని ఆర్మూర్ పట్టణ కాంగ్రెస్ నాయకుడు కోల వెంకటేష్ అన్నారు. శుక్రవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మైనారిటీలకు ఇచ్చిన హామీలు వాటి స్థితిగతుల పై క్షేత్ర స్థాయిలో పర్యటించి తెలుసుకొని విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా కాంగ్రెస్ నాయకులు కోలా వెంకటేష్ మాట్లాడుతూ సీఎం మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్ అని చెప్పి మోసం చేస్తే, ఇక్కడ ఆర్మూర్లో జీవన్ రెడ్డి మైనారిటీలకు ఎన్నో హామీలు ఇచ్చి తొమ్మిదిన్నర సంవత్సరాలు గడిచినా ఒక్క హామీ నెరవేర్చలేదన్నారు. ఆర్మూర్ లోని జిరాయత్ నగర్, పెర్కిట్ లలో షాదిఖానా లకు కోటిన్నర, 50 లక్షలు అని చెప్పి ఇప్పటివరకు ఒక్క రూపాయి ఇవ్వలేదు అన్నారు.

ఆర్మూర్ లోని సైదాబాద్ ఉర్దూఘర్ నిర్మాణానికి 25 లక్షలు ఇస్తా అని చెప్పి ఇప్పటివరకు ఇవ్వలేదు అన్నారు. నిజామాబాద్ రోడ్ ఈద్ గా అభివృద్ధికి 25 లక్షలు ఇస్తా అని చెప్పి ఇవ్వలేదని, పెర్కిట్ కరీంనగర్ రోడ్ కబ్రిస్తాన్లో దుకాణ సముదయానికి 10 లక్షలు ఇస్తా అని జీవన్ రెడ్డి ఇవ్వలేదన్నారు. ఆర్మూర్ లోని జమాత్ లకు ఆఫీస్ లకు 10 లక్షలు ఇస్తా అని ఇవ్వలేదని, ఆర్మూర్ మార్కాజ్ ఆఫీస్ కి 25 లక్షలు ఇస్తా అని ఇవ్వలేదని, మౌల ఖాజీ లకు ఇళ్ల స్థలాలు ఇస్తా అని ఇవ్వలేరని,మైనారిటీ యువకులు లోన్ల కోసం వేలల్లో దరఖాస్తు చేసుకుంటే 50 మందికి కూడ రుణాలు ఇవ్వలేదన్నారు. ఆర్మూర్ మైనారిటీ ఉర్దూ జూనియర్ కాలేజీలో ఎంపీసీ, బైపీసీ ఉర్దూ మీడియం లెక్చరర్లు లేరు అని ఈ విద్యా సంవత్సరం ప్రారంభం అయ్యే లోపు నియమించాలి కోరినట్లు చెప్పారు.

మున్సిపాలిటీ పాలకవర్గం గడువు ముడున్నర సంవత్సరాలు గడుస్తున్న కో ఆప్షన్ సభ్యులను ఎన్నిన చేయకుండా ఎమ్మెల్యే రాజకీయంగ మైనారిటీలను అణచివేస్తున్నాడు అని అన్నారు. ఇక్బాల్ మీనార్ నిర్మాణం చేపిస్తా అని ఇప్పటివరకు చేయలేదు అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ హయాంలోనే మైనారిటీలకు న్యాయం జరిగింది అని 4% రిజర్వేషన్ కాని ఉర్దూ స్కూల్ కాలేజీలు కాని, సైదాబాద్ ఉర్దూ ఘర్ నిర్మాణం కాని అనేక అభివృద్ధి కార్యక్రమలు కాంగ్రెస్ పార్టీ హయాంలోనే జరిగాయి అని అన్నారు. తొమ్మిదిన్నర సంవత్సరాల జీవన్ రెడ్డి హయాంలో మైనార్టీలకు ఎమ్మెల్యే డోకా చేశాదే తప్ప అభివృద్ధి చేయలేదన్నారు.తెల్ల పేపర్ చూపి దానినే ప్రొసీడింగ్ అని మోసం చేస్తున్నట్లు చెప్పారు.

ఎమ్మెల్యే ఏదైనా ప్రభుత్వ నిధులతో అభివృద్ధి పని చేయాలంటే దానికి నిధులు మంజూరు చేస్తూ ప్రొసీడింగ్ తర్వాత టెండర్, అగ్రిమెంట్, ఎస్టీమెట్ అంటూ ఒక ప్రక్రియ ఉంటుంది అని ఇకనైనా గాలి మాటలు ఆపి మీకు మైనారిటీ అభివృద్ధిపై చిత్తశుద్ధి ఉంటే వారి అభివృద్ధికి తోడ్పాటు అందించాలన్నారు. కాని ఎన్నికలు వస్తున్నాయి అని హడావిడిగా మళ్ళీ బుటకపు పనులు ప్రారంభిస్తే మీకు ఎన్నికల్లో తగిన బుద్ది చెప్పడం ఖాయమన్నారు. మైనార్టీ నాయకులు హబీబ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ హయాంలో జరిగిన అభివృద్ధి తప్పితే బిఆర్ఎస్ హయాంలో మైనారిటీలకు ఒక్క అభివృద్ధి జరుగ లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో మీకు తగిన శిక్ష వేయటం ఖాయం అని అన్నారు. అనంతరం ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మైనార్టీ ప్రతినిధులకు ఇచ్చిన పలు హామీలను, సమస్యలకు సంబంధించిన కరపత్రాలను కాంగ్రెస్ నాయకులు ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో నాయకులు మీర్ మాజీద్, మెహబూబ్, ఉస్మాన్, మందుల పోశెట్టి, పాషా, బాల కిషన్, అహ్మద్ ఖాన్, సల్మాన్, పెద్ద పోశెట్టి, శ్రీకాంత్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Next Story

Most Viewed