సింగపూర్ ఎయిర్ లైన్స్ ప్రమాదం.. ఐసీయూలో 20 మందికి చికిత్స

by Shamantha N |
సింగపూర్ ఎయిర్ లైన్స్ ప్రమాదం.. ఐసీయూలో 20 మందికి చికిత్స
X

దిశ, నేషనల్ బ్యూరో: సింగపూర్ ఎయిర్ లైన్స్ ప్రమాద ఘటనకు సంబంధించి మరో 20 మంది ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం (SQ321) మే 20న మొత్తం 211 మంది ప్రయాణికులు, 18 మంది సిబ్బందితో లండన్‌ నుంచి సింగపూర్‌కు బయల్దేరింది. మరికొన్ని గంటల్లో గమ్యస్థానం చేరాల్సి ఉండగా.. ఒక్కసారి కుదుపునకు లోనైంది విమానం. పరిస్థితి అంతా అల్లకల్లోలంగా మారింది. ఆకాశంలో అలజడికి గురికాగానే థాయ్‌లాండ్‌ రాజధాని బ్యాంకాక్‌లో ఎమర్జెన్సీ ల్యాండ్ అయింది.

ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా.. దాదాపుగా వంద మంది ప్రయాణికులు గాయపడ్డారు. అయితే, ప్రస్తుతం 20 మంది ఐసీయూలో ట్రీట్మెంట్ పొందుతున్నారు. మరో, 85 మంది సాధారణ వార్డుల్లో చికిత్స పొందుతున్నట్లు బ్యాంకాక్ అధికారులు తెలిపారు. మరోవైపు, మృతుని కుటుంబానికి ఎయిర్‌లైన్స్ సంతాపం తెలిపింది. అలాగే గాయపడిన వారికి కూడా సింగపూర్ ఎయిర్ లైన్సే వైద్య సదుపాయం అందిస్తోంది.

Next Story