గొంతెండుతోంది.. ఖాళీ బిందెలతో రోడ్డెక్కిన మహిళలు

by srinivas |
గొంతెండుతోంది.. ఖాళీ బిందెలతో రోడ్డెక్కిన మహిళలు
X

దిశ, వెబ్ డెస్క్: ఏలూరు జిల్లాలో మంచి నీటి కొరత ఏర్పడింది. దొరసానిపాడులో గుక్కెడు నీళ్లు దొరక్క మహిళలు రోడ్డెక్కారు. ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు. దొరసానిపాడులో పంపుల ద్వారా నీళ్లందించేవారు. అయితే పంచాయతీ సిబ్బంది ఈ మధ్యకాలంలో పట్టించుకోలేదు. దీంతో గ్రామంలో నీటికి కటకట ఏర్పడింది. తాగునీరు దొరక్క స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఊరికి దూరంగా ఉన్న చెరువులో నుంచి బిందెలతో నీళ్లు తెచ్చుకుని గొంతు తడుపుకుంటున్నారు. ఇప్పటికైనా పంపుల ద్వారా నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం పట్టించుకోకపోతే నిరసనను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

Next Story