దేశవ్యాప్తంగా నిరసనలు.. పూణే ప్రమాద నిందితుడికి బెయిల్ రద్దు

by Shamantha N |
దేశవ్యాప్తంగా నిరసనలు.. పూణే ప్రమాద నిందితుడికి బెయిల్ రద్దు
X

దిశ, నేషనల్ బ్యూరో: పూణెలో ఇద్దరు టెకీల మృతికి కారణమైన బాలుడికి గంటల వ్యవధిలోనే బెయిల్ దొరికింది. దీనిపై దేశ వ్యాప్తంగా తీవ్ర నిరసనలు చెలరేగాయి. దీంతో బాలుడికి మంజూరు చేసిన బెయిల్ ను జువైనల్ జస్టిస్ బోర్డు రద్దు చేసింది. బాలనేరస్థుడిని జూన్ 5 వరకు రిమాండ్ హోమ్‌కు పంపింది. అతడిని వయోజనుడిగా విచారించాలా వద్దా అనే దానిపై నిర్ణయం తీసుకోలేదు.

ఆదివారం అర్ధరాత్రి పలువురు బాలురు బార్‌లో మద్యం తాగి.. అత్యంత వేగంగా పోర్షే కారును నడపడంతో ఇద్దరు టెకీలు ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత స్పాట్ కి చేరుకున్న పోలీసుల.. నిందితుల్ని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. యాక్సిడెంట్‌కు కారణమైన బాలుడికి బెయిల్ మంజూరు చేసింది పూణే కోర్టు. అంతేకాకుండా రోడ్డుప్రమాదాలపై వ్యాసం రాసుకుని రమ్మని చెప్పింది. వ్యక్తిగత బాండ్, రవాణా కార్యాలయాన్ని సందర్శించి అన్ని నియమాలు, నిబంధనలు అధ్యయనం చేసి ప్రజెంటేషన్ ఇవ్వాలని తెలిపింది. మానసిక వైద్యులను సంప్రదించాలని సూచించింది. ఈ తీర్పుతో దేశప్రజలు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. బాధిత కుటుంబాలు సైతం కోర్టు తీర్పుపై అసహనం వ్యక్తం చేశాయి. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశాయి. ఇక సోషల్ మీడియాలో అయితే కోర్టు తీర్పుపై నెటిజన్లు మండిపడ్డారు. దీంతో నిరసనలకు తగ్గిన కోర్టు.. బెయిల్ రద్దు చేసింది.

Next Story