- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
'పెండింగ్ పనులకు నిధులు మంజూరు చేయించండి'
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న నందిపేట్ ఆర్అండ్ బీ గెస్ట్ హౌస్, మారంపల్లి డొంకేశ్వర రోడ్డు నిర్మాణ పనులకు నిధులు మంజూరు చేయించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి కోరారు.

దిశ, ఆర్మూర్ : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న నందిపేట్ ఆర్అండ్ బీ గెస్ట్ హౌస్, మారంపల్లి డొంకేశ్వర రోడ్డు నిర్మాణ పనులకు నిధులు మంజూరు చేయించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి కోరారు. మంగళవారం అసెంబ్లీ ఆవరణలో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ని మర్యాద పూర్వకంగా కలిసి విన్నవించారు. ఆర్మూర్ నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న నిధులను, నందిపేటలో ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ ను, మారంపల్లి, డొంకేశ్వర్ రోడ్డు వెడల్పు నిర్మాణ పనులను.. ఇటీవల ప్రారంభించిన రోడ్ల పనులు, వాటికి నిధులు వెంటనే మంజూరు చేయాలని డిప్యూటీ సీఎం భట్టి ని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి కోరారు. దీంతో డిప్యూటీ సీఎం స్పందించి అతి త్వరలో నిధులు మంజూరు చేస్తానని తెలిపినట్లు ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి తెలిపారు.






