ఏఆర్ కానిస్టేబుల్ సస్పెన్షన్ .. ఎందుకంటే..?

by Naveena |

తమ్ముడి భార్యను వారం రోజుల క్రితం దారుణంగా కట్టెతో కొట్టి, గాయపరచిన కేసులో ఏఆర్ కానిస్టేబుల్ సంతోష్ గౌడ్ పై కేసు నమోదు అయ్యింది.

ఏఆర్ కానిస్టేబుల్ సస్పెన్షన్ .. ఎందుకంటే..?
X

దిశ ,భిక్కనూరు : తమ్ముడి భార్యను వారం రోజుల క్రితం దారుణంగా కట్టెతో కొట్టి, గాయపరచిన కేసులో ఏఆర్ కానిస్టేబుల్ సంతోష్ గౌడ్ పై కేసు నమోదు అయ్యింది. దీంతో అరెస్ట్ తప్పదన్న ఉద్దేశంతో రెండు రోజులుగా పరారీలో ఉన్నాడు. ఈ మేరకు ఎస్ఐ ఆంజనేయులు ఆధ్వర్యంలోని పోలీసులు భిక్కనూరు మండల కేంద్రంలోని ఆయన నివాసానికి బుధవారం వెళ్లి చూడగా తాళం వేసి ఉంది. ఈ విషయాన్ని చుట్టుపక్కల వారిని పోలీసులు ప్రశ్నించగా.. రెండు రోజులుగా తాళం వేసి ఉందని తెలిపారు. వెంటనే ఆయన సెల్ కు ఫోన్ చేయగా.. కవరేజ్ ఏరియాలో లేదంటూ సమాధానం వస్తుంది. దీంతో పోలీసులు అతడు ఎక్కడ ఉన్నాడో గుర్తించేందుకు ఫోన్ ను ట్రాక్ లో పెట్టారు. అయితే సొంత మరదలు పై దాడి చేసిన విషయం జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో.. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర, విచారణ నివేదికతో పాటు, మెడికల్ రిపోర్ట్ ఆధారంగా సస్పెండ్ చేసినట్లు ఎస్ఐ ఆంజనేయులు "దిశ" తో మాట్లాడుతూ వివరించారు.

Next Story