నిజామాబాద్ కు చేరిన అనస్థీషియా జ్యోతి

by Batti.Sumithra |

భారతీయ మత్తు వైద్య సంఘం ఆవిర్భవించి 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్బంగా దేశవ్యాప్తంగా అనస్థీషియా జ్యోతిని ప్రజా అవగాహన కల్పిస్తున్నారు.

నిజామాబాద్ కు చేరిన అనస్థీషియా జ్యోతి
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: భారతీయ మత్తు వైద్య సంఘం ఆవిర్భవించి 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్బంగా దేశవ్యాప్తంగా అనస్థీషియా జ్యోతిని ప్రజా అవగాహన కల్పిస్తున్నారు. అందులో భాగంగా మంగళవారం నిజామాబాద్ కు చేరింది. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి వద్ధ అనస్థీషియా వైద్యులు దానికి స్వాగతం పలికారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ విరేశం, జనరల్ సెక్రటరీ డాక్టర్ రామకృష్ణ రెడ్డి, జాతీయ కౌన్సిల్ మెంబర్ డాక్టర్ కిషన్, నిజామాబాద్ మత్తు వైద్యులు సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంబీబీఎస్, మెడికల్, పారమెడికల్ సిబ్బందికి అవగాహన కల్పించారు.

Next Story