గుప్త నిధుల త‌వ్వ‌కానికి య‌త్నం

by Ratna Kumari |   (  Updated:2026-05-21 09:35:57  IST  )

గుప్త నిధులు తవ్వడానికి వచ్చిన ఓ గ్యాంగ్ గ్రామస్తులు మేల్కోవడంతో అక్కడి నుంచి పరారైన సంఘటన కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం మల్లూరు గ్రామంలో బుధవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది.

గుప్త నిధుల త‌వ్వ‌కానికి య‌త్నం
X
దిశ, కామారెడ్డి : గుప్త నిధులు తవ్వడానికి వచ్చిన ఓ గ్యాంగ్ గ్రామస్తులు మేల్కోవడంతో అక్కడి నుంచి పరారైన సంఘటన కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం మల్లూరు గ్రామంలో బుధవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. గ్రామ‌స్తులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. మల్లూరు గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తన ఇంట్లో గుప్త నిధులు ఉన్నాయని అనుమానంతో ఆదిలాబాద్ జిల్లా బోత్ గ్రామానికి చెందిన కొంత మందిని అలాగే మహారాష్ట్రకు చెందిన మరి కొంతమందిని గ్రామానికి రప్పించాడు. గుప్త నిధులు తవ్వడానికి వచ్చిన గ్యాంగ్ పూజ సామాగ్రిని తమ వెంట తీసుకువచ్చి పూజలు చేసే క్రమంలో గ్రామస్తులకు మెలకువ రావడంతో అక్కడి నుంచి వారు పరారయ్యారు. వారిని గ్రామస్తులు వెంబడించగా ఆదిలాబాద్ జిల్లా బోత్ గ్రామానికి చెందిన కొంత మంది పట్టుబడగా మహారాష్ట్ర నుంచి వచ్చిన దుండగులు మాత్రం పరారైనట్లు తెలిసింది. పట్టుబడిన బోత్ గ్రామానికి చెందిన వారిని పోలీసులకు అప్పగించగా వారు అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నట్లు సమాచారం. గ్రామాల్లో దొంగల సంచారం, అలజడి ఉండడంతో గుప్తనిధుల కోసం వచ్చిన వారు దొంగతనానికే వచ్చారా లేక గుప్త నిధుల తవ్వకానికి కోసమే వచ్చారా అని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. ఏది ఏమైనా పోలీసులు గ్రామాల్లో నిఘా ఏర్పాటు చేసి ప్రజలకు దొంగతనాలపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
Next Story