- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ని కలిసిన ఏఎంసీ డైరెక్టర్
నందిపేట మండలంలోని కంఠం గ్రామ అభివృద్ధి కోసం పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌ను కలిసిన ఏఎంసీ డైరెక్టర్ పెంట ఇంద్రుడు, గ్రామ సమస్యలపై వినతిపత్రాన్ని అందజేశారు.

దిశ, నందిపేట్ : నందిపేట మండలంలోని కంఠం గ్రామ అభివృద్ధి కోసం పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌ను కలిసిన ఏఎంసీ డైరెక్టర్ పెంట ఇంద్రుడు, గ్రామ సమస్యలపై వినతిపత్రాన్ని అందజేశారు. గ్రామ చివర నుండి మెయిన్ రోడ్ వరకు ఉన్న రోడ్డు తక్కువ వెడల్పుతో ఉండటంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోందని, ప్రమాదాలూ పెరిగినట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆర్ అండ్ బి రోడ్డును విస్తరించేందుకు తక్షణమే నిధులు మంజూరు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. అంతేగాక, గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణానికి ఎమ్మెల్సీ నిధుల నుంచి రూ.30 లక్షలు కేటాయించాలని కోరారు.
గ్రామంలో నిరుపేద కుటుంబాల సంఖ్య అధికంగా ఉన్న నేపథ్యంలో, ఇందిరమ్మ ఇండ్లను కేటాయించాల్సిన అవసరం ఉందని మహేష్ కుమార్ గౌడ్‌కు విన్నవించారు. వినతిపత్రం అందుకున్న వెంటనే మహేష్ కుమార్ గౌడ్ స్పందించి సంబంధిత అధికారులతో చర్చించారని, త్వరలోనే అవసరమైన నిధులు మంజూరవుతాయని హామీ ఇచ్చినట్లు సమాచారం. ఈ సందర్భంగా కంఠం గ్రామస్తులు ఆయనకు శాలువాతో సన్మానం చేశారు.






