- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రిని 200 నుంచి 150 పడకలకు కుదించడం సరికాదు : ఏఐటీయూసీ
దిశ, బాన్సువాడ : బాన్సువాడ ప్రభుత్వ ఏరియా, మాత శిశు ఆసుపత్రి 200 పడకల నుంచి 150 పడకలకు కుదించడం సరి కాదని ఏఐటీయూసీ నాయకులు దుబాస్ రాములు పేర్కొన్నారు.

దిశ, బాన్సువాడ : బాన్సువాడ ప్రభుత్వ ఏరియా, మాత శిశు ఆసుపత్రి 200 పడకల నుంచి 150 పడకలకు కుదించడం సరి కాదని ఏఐటీయూసీ నాయకులు దుబాస్ రాములు పేర్కొన్నారు. తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ ఏ.ఐ.టీ.యూ.సీ. ఆధ్వర్యంలో మంగళవారం సూపరింటెండెంట్ విజయలక్ష్మి కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏ.ఐ.టీ.యూ.సీ. జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ దుబాస్ రాములు మాట్లాడుతూ.. బాన్సువాడ పట్టణంలో గల ఏరియా హాస్పిటల్, ఎం.సి.ఎచ్. హాస్పిటల్ కలిపి 200 పడకలు ఉన్న ఈ హాస్పిటల్ ను 150 పడకలకు తగ్గించడం వల్ల కార్మికుల సంఖ్యను కుదించడంతో పాటు హాస్పిటల్ కి వచ్చే పేద ప్రజలు సమస్యలు ఎదుర్కొంటారని తెలిపారు. ఆసుపత్రి లో పనిచేసే శానిటేషన్ సిబ్బందిని తగ్గించడం వల్ల వాళ్లు వీధిన పడతారని ఆయన పేర్కొన్నారు.
ఇటీవల తెలంగాణ వైద్య విధాన పరిషత్ అధికారులు బాన్సువాడ హాస్పిటల్ ఇన్ పేషంట్ అవుట్ పేషంట్ 75% సెన్సెస్ తక్కువగా ఉందనే ఉద్దేశంతో తప్పుడు సమాచారం తో 150 పడకలకు కుదించారని ఆయన పేర్కొన్నారు. హాస్పటల్ నుండి తప్పుడు రిపోర్టులు పంపడం మూలంగా సమస్య ఎదురయిందని వెంటనే సంబంధిత అధికారులు స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఏరియా& ఎం.సి.హెచ్. హాస్పటల్ కు బాన్సువాడ,జుక్కల్, ఎల్లారెడ్డి నియోజకవర్గాలతో పాటు పక్క రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక నుండి ప్రతిరోజు ఇన్ పేషెంట్, ఔట్ పేషెంట్ కలిపి వందల సంఖ్యలో వందలాది పేషంట్లు వస్తారని ఆయన తెలిపారు. పండగ సందర్భంగా కొంత కార్మికులకు జీతాలు పడలేని పరిస్థితి ఎదురైందని తెలిపారు. తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఉన్నతాధికారులు స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో రేణుక, ధనుంజయ్, లక్ష్మణ్, మహేందర్, రాజేశ్వరి పాల్గొన్నారు.






