- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జూనియర్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ కైవసం చేసుకున్న కార్తికేయ
by Batti.Sumithra |
చత్రపతి శివాజీ మహారాజ్ అకాడమీ హైదరాబాద్ గోషామహల్ ఆధ్వర్యంలో నిర్వహించిన అండర్ 14 బాక్సింగ్ ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహించారు.

X
దిశ, గాంధారి : చత్రపతి శివాజీ మహారాజ్ అకాడమీ హైదరాబాద్ గోషామహల్ ఆధ్వర్యంలో నిర్వహించిన అండర్ 14 బాక్సింగ్ ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో కామారెడ్డి జిల్లా గాంధారి మండలానికి చెందిన హరాలే కార్తికేయ విజయం సాధించాడు. దీంతో గ్రామస్తులు మండల ప్రజలు అభినందనలతో ముంచేస్తున్నారు.
గాంధారి మండలానికి చెందిన చక్రధర్ రావు జ్యోతిల కుమారుడు హైదరాబాదులో విద్యాభ్యాసంతో పాటు చత్రపతి శివాజీ మహారాజ్ అకాడమీలో బాక్సింగ్ కూడా నేర్చుకుంటున్నాడు. ఈ నేపధ్యంలోనే తాను పోటీల్లో పాల్గొని విజయం సాధించాడు. తమ కొడుకు ఇలా అంచలంచెలుగా ఎదగడం తమకు ఎంతో ఆనందంగా ఉందని బాలుడి తల్లిదండ్రులు హర్షం చేశారు.
Next Story






