- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పోలీసులను పరేషాన్ చేసిన మహిళా ఖైదీ
కామారెడ్డి జిల్లా బాన్సువాడలో జరిగిన ఓ దొంగతనం కేసులో అరెస్టయిన ఓ మహిళా ఖైది బుధవారం నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి (జీజీహెచ్) పోలీసులను పరేషాన్ చేసింది.

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : కామారెడ్డి జిల్లా బాన్సువాడలో జరిగిన ఓ దొంగతనం కేసులో అరెస్టయిన ఓ మహిళా ఖైది బుధవారం నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి (జీజీహెచ్) పోలీసులను పరేషాన్ చేసింది. దాదాపు గంట పాటు పోలీసులకు చుక్కలు చూపించింది. దొంగతనం కేసులో అరెస్ట్ అయి ఆస్పత్రిలో తన బిడ్డతో పాటు చికిత్స పొందుతున్న మహిళా ఖైది శ్రావణి వాష్ రూంకు వెళ్తానని చెప్పి వెళ్లింది. పై అంతస్థులో చికిత్స పొందుతున్న నిందితురాలు వాష్ రూంకు వెళుతున్నట్లుగా పోలీసులకు చెప్పి అక్కడి నుంచి పోలీసుల కళ్లు గప్పి తప్పించుకుంది. వాష్ రూం వెళ్లిన శ్రావణి ఎంతకూ రాకపోవడంతో అనుమానం వచ్చి పోలీసులు ఆమె కోసం చూడగా అక్కడ కనిపించలేదు. మెయిన్ గేట్ నుంచి బయటకు వెళ్లి తప్పించుకుని వెల్లిపోయిందేమోననే అనుమానంతో పోలీసులు సీసీ ఫుటేజీని చెక్ చేయగా, ఆమె బయటకు వెళ్లినట్లు కనిపించలేదు. దాంతో నిందితురాలు ఆస్పత్రిలోనే దాక్కుని ఉందేమోనని వెతికారు. సీసీ ఫుటేజీ ఆధారంగా గుర్తించి తిరిగి ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గంటకు పైగా నిందితురాలు శ్రావణి పోలీసులకు చుక్కలు చూపి చెమటలు కక్కించింది. ఆస్పత్రి ఆవరణలోనే దాక్కుని హైడ్రామా క్రియేట్ చేసింది. ఎట్టకేలకు నిందితురాలు పోలీసులకు చిక్కడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.






