మహిళ దారుణ హత్య

by Ratna Kumari |

దిశ‌, న‌వీపేట : ఓ మ‌హిళా దారుణ హ‌త్య‌కు గురైన సంఘ‌ట‌న న‌వీపేట పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకుంది. సీఐ శ్రీనివాస్ వెల్ల‌డించిన వివ‌రాల ప్ర‌కారం.. బాసర ర

మహిళ దారుణ హత్య
X

దిశ‌, న‌వీపేట : ఓ మ‌హిళా దారుణ హ‌త్య‌కు గురైన సంఘ‌ట‌న న‌వీపేట పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకుంది. సీఐ శ్రీనివాస్ వెల్ల‌డించిన వివ‌రాల ప్ర‌కారం.. బాసర రహదారి సమీపంలో ఫతేనగర్ శివారు నిజాం సాగర్ కెనాల్ పక్కన శుక్రవారం ఉదయం గుర్తు తెలియని మహిళను హత్య చేసి పెట్రోల్ పోసి తగలబెట్టారనే సమాచారంతో నవీపేట్ ఎస్.ఐ. తిరుపతి సంఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. మద్దేపల్లి గ్రామానికి చెందిన లక్ష్మి (45) గా గుర్తించారు. నార్త్ రూరల్ సీఐ శ్రీనివాస్ హత్య జరిగిన స్థలానికి చేరుకొని డాగ్ స్క్వాడ్ తో గాలించారు. మృతురాలి చెల్లెలు శ్యామల పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని పంచానామా చేశారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం జిల్లా జనరల్ హాస్పిటల్ కు తరలించామని, దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

Next Story