- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మృత్యువు సైతం వీడని స్నేహ బంధం
దిశ, మాచారెడ్డి : వారి స్నేహ బంధాన్ని మృత్యువు సైతం వీడలేదు. అన్ని బంధాల కంటే స్నేహ బంధమే గొప్పదని

దిశ, మాచారెడ్డి : వారి స్నేహ బంధాన్ని మృత్యువు సైతం వీడలేదు. అన్ని బంధాల కంటే స్నేహ బంధమే గొప్పదని మండలం లోని లచ్చాపేట గ్రామంలో రోడ్డు ప్రమాదం లో మృతి చెందిన ఇద్దరు మిత్రుల అకాల మరణం మరోసారి నిరూపించింది. లచ్చాపేట గ్రామానికి చెందిన మిరిదొడ్డి అజయ్, జక్కుల సాయి ఇద్దరు క్లాస్ మేట్స్. అజయ్ ఫోటో గ్రఫీ లో ఎర్న్ చేస్తుంటే సాయి వ్యవసాయం లో చేస్తున్నాడు. ఇక్కడ కులాలు, చేసే వృత్తి వేరైనా స్నేహ బంధం వీరిద్దరి ని కట్టి పడేసింది. మంచి చెడులు ఏవైనా పరస్పరం షేర్ చేసుకునేవారు. ఎప్పటి మాదిరిగానే వీరు మెడిసిన్ తెచ్చుకుందామని గజ్యానాయక్ తండా కూడలి కి వెళ్లారు. అక్కడ పని కానిచ్చి తిరుగు ప్రయాణంలో మరి కొద్ది క్షణాలలో గ్రామంలో కి ప్రవేశించే ముందు ఆగి ఉన్న లారీ రూపంలో దాగి ఉన్న మృత్యువు వారిని విగత జీవులు గా మార్చేసింది. రెప్ప పాటులో జరిగిన ప్రమాదం వారి తల్లిదండ్రులకు గర్భ శోకం మిగిల్చింది. విధి విచిత్రమేమో తెలియదు కానీ, ఆ రెండు కుటుంబాల్లో కూడా ఇద్దరు కూతుళ్లు, ఒక్క కుమారుడు. ఆరెండు కుటుంబాల్లో కూడా ఇంటి దీపాలను మృత్యువు ఆర్పేసింది. రెండు కుటుంబాల్లో ఇద్దరేసి కూతుళ్లు, ఒక్కరేసి కొడుకులుండడం యాదృచ్ఛిక మే. ఇదే విషయాన్ని తలుచుకుంటూ లచ్చాపేట గ్రామం కన్నీటి పర్యంతమైంది. అశ్రునయనాల మధ్య కన్నీటి వీడ్కోలు పలికారు.






