తాడ్వాయిలో త‌ప్పిన పెను విషాదం..!

by Ratna Kumari |

దిశ, తాడ్వాయి : తాడ్వాయి మండలంలో ఆదివారం పెను ప్రమాదం తృటిలో తప్పింది. ఓ శుభకార్యానికి హాజరయ్యేందుకు ప్రయాణిస్తున్న ఆటో చిట్యాల-తాడ్వాయి రోడ్డు మార్గంలో బోల్తా పాడి రెండు పాల్టీలు కొట్టడంతో,అందు

తాడ్వాయిలో త‌ప్పిన పెను విషాదం..!
X

దిశ, తాడ్వాయి : తాడ్వాయి మండలంలో ఆదివారం పెను ప్రమాదం తృటిలో తప్పింది. ఓ శుభకార్యానికి హాజరయ్యేందుకు ప్రయాణిస్తున్న ఆటో చిట్యాల-తాడ్వాయి రోడ్డు మార్గంలో బోల్తా పాడి రెండు పల్టీలు కొట్టడంతో అందులో ప్రయాణిస్తున్న ఒక వ్యక్తికి చేయి విరగగా.. మరికొందరికి స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన కథనం ప్రకారం.. సంతాయిపెట్ గ్రామం నుంచి ఫంక్షన్‌కు హాజరయ్యేందుకు సుమారు 12 మంది ఆటోలో బయలుదేరారు. తాడ్వాయి-చిట్యాల రోడ్డు మధ్యలో ఒక్కసారిగా ఆటో అదుపుతప్పింది. వేగంగా వస్తున్న ఆటో ఒక్కసారిగా పక్కకు పల్టీ కొట్టడంతో అందులో ఉన్న ప్రయాణికులకు కొందరికీ తీవ్రంగా గాయాలు అయ్యాయి. మరికొందరికి స్వల్ప గాయాలు అయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి ఆటోలో ఉన్న వారందరినీ బయటకు తీసి 108 అంబులెన్సుకు ఫోన్ చేయ‌గా గాయపడిన వారిని రెండు అంబులెన్సులో కామారెడ్డి జిల్లా ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ నిర్లక్ష్యం తోనే ఈ ప్రమాదం జరిగిందని కొందరూ అంటుంటే..రోడ్డుపై తీసిన గుంతలో ముందు టైర్ పడడంతోనే ఈ ప్రమాదం సంభవించిందని మరికొందరు స్థానికులు పేర్కొంటున్నారు.

Next Story