- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వరదల వల్ల నష్టపోయిన ప్రతి కుటుంబానికి రూ.10 నుంచి 15 లక్షలు చెల్లించాలి : సీపీఎం
దిశ, కామారెడ్డి టౌన్ : కామారెడ్డిలో భారీ వర్షాల వల్ల నష్టపోయిన ఒక్కొక్క కుటుంబానికి రూ.10 నుంచి రూ.15 లక్షల వరకు పంట నష్టపరిహారం ఎకరానికి 40, 000 చెల్లించాలని సీపీఐ జిల్లా

దిశ, కామారెడ్డి టౌన్ : కామారెడ్డిలో భారీ వర్షాల వల్ల నష్టపోయిన ఒక్కొక్క కుటుంబానికి రూ.10 నుంచి రూ.15 లక్షల వరకు పంట నష్టపరిహారం ఎకరానికి 40, 000 చెల్లించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆయన మీడియాతో మాట్లాడారు. కామారెడ్డి జిల్లాలో 26, 27 తేదీల్లో కురిసిన భారీ వర్షాల వల్ల కామారెడ్డి జిల్లా పూర్తిగా నష్టపోయింది. ముఖ్యంగా రహదారులు, పంట నష్టం ఎక్కువగా జరిగింది. పకృతి విలయతాండవం చేసి నేటికీ సుమారుగా 80 రోజులు అవుతున్నా.. కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి నష్ట పరిహారాన్ని అంచవేయడానికి కేంద్ర బృందాన్ని పంపించినందుకు ఇప్పటికైనా ధన్యవాదాలు తెలుపుతున్నామని తెలిపారు. ఇప్పటికైనా కామారెడ్డి హౌసింగ్ బోర్డ్ కాలనీ, బతుకమ్మ కుంట, కౌడిన్య కాలనీ వాసులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఒక్కొక్క కుటుంబానికి దాదాపు 15లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందని.. అందించేలా కేంద్ర బృందం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సీఎం రేవంత్ రెడ్డి స్పందించిన తీరు బాగుందని.. కానీ నష్టపరిహారం అందించడంలో ప్రభుత్వం విఫలం చెందిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సెక్రటేరియట్ సభ్యులు వెంకట్ గౌడ్, మోతీరామ్ నాయక్, కొత్త నరసింహులు, అరుణ్ పాల్గొన్నారు.






