- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TG: తొమ్మిది మంది పంచాయతీ కార్యదర్శులు సస్పెండ్
by Gantepaka Srikanth |
పంచాయతీ కార్యదర్శు(Panchayat Secretaries)లకు యాదాద్రి భువనగిరి కలెక్టర్ హనుమంత రావు(Collector Hanumantha Rao) భారీ షాకిచ్చారు.

X
దిశ, వెబ్‌డెస్క్: పంచాయతీ కార్యదర్శు(Panchayat Secretaries)లకు యాదాద్రి భువనగిరి కలెక్టర్ హనుమంత రావు(Collector Hanumantha Rao) భారీ షాకిచ్చారు. విధులకు హాజరు కాకుండా అటెండెన్స్ వేయించుకుంటున్న వారికి కలలో కూడా ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. విధులకు హాజరు కాకుండానే హాజరయినట్లు రికార్డులో నమోదు చేసుకున్న తొమ్మిది మంది పంచాయతీ కార్యదర్శులను కలెక్టర్ హనుమంతరావు సస్పెండ్ చేశారు. ఈ మేరకు శనివారం అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. రామన్నపేట, ఆత్మకూరు, చౌటుప్పల్, మోత్కూరు, గుండాల, నారాయణపురం మండలాల్లో పలువురు కార్యదర్శులు సస్పెండైన వారిలో ఉన్నారు. ఆ మండలాలకు సంబంధించిన ఎంపీడీవోలకు సైతం కలెక్టర్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
Next Story






