- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Operation Eagle: మెడిసిటీ కాలేజీలో గంజాయి భూతం.. 9 మందికి పాజిటివ్
రాష్ట్రంలో డ్రగ్స్ భూతాన్ని రూపుమాపేందుకు ఈగల్ టీమ్ (Eagle Team) దొరికిన డ్రగ్ పెడ్లర్లు, సప్లయర్స్‌ను దొరికినట్లుగా అరెస్ట్ చేస్తోంది.

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో డ్రగ్స్ భూతాన్ని రూపుమాపేందుకు ఈగల్ టీమ్ (Eagle Team) దొరికిన డ్రగ్ పెడ్లర్లు, సప్లయర్స్‌ను దొరికినట్లుగా అరెస్ట్ చేస్తోంది. ఈ క్రమంలో హైదరాబాద్‌లో మెడిసిటీ మెడికల్ కాలేజీ (Medicity Medical College)లో గంజాయి భూతం కలకలం రేపింది. కాలేజీకి గంజాయి సప్లై చేస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేసిన ఈగల్ టీమ్ పోలీసులు.. వారి బ్యాంక్ అకౌంట్స్ ట్రాన్సాక్షన్స్ ద్వారా 82 మంది డ్రగ్స్‌ను కొంటున్నట్లు గుర్తించారు. 82 మందిలో 32 మంది మెడిసిటీ మెడికల్ కాలేజీకి చెందినవారుగా తేలడంతో.. 24 మంది విద్యార్థులకు డ్రగ్స్ టెస్టు చేశారు. ఈ టెస్టులో 9 మందికి పాజిటివ్ రాగా.. ఇద్దరు అమ్మాయిలు కూడా ఉండటం షాక్‌కు గురిచేసింది. వీరంతా హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటున్నవారు కావడంతో.. పోలీసులు, కాలేజీ యాజమాన్యం వారి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. అనంతరం తొమ్మిది మంది విద్యార్థుల్ని డీ- అడిక్షన్ సెంటర్ కు పంపారు.






