శ్రీవారికి నీలోఫర్ కేఫ్‌ ఓనర్ భారీ కానుక.. వజ్రాలతో పొదిగిన బంగారు యజ్ఞోపవీతం సమర్పణ

by Ramesh Naini |

హైదరాబాద్‌‌లోని ప్రముఖ రెస్టారెంట్ ‘నీలోఫర్ కేఫ్’ ఓనర్ బాబూరావు శ్రీవారికి భారీ కానుకను సమర్పించారు.

శ్రీవారికి నీలోఫర్ కేఫ్‌ ఓనర్ భారీ కానుక.. వజ్రాలతో పొదిగిన బంగారు యజ్ఞోపవీతం సమర్పణ
X

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్‌‌లోని ప్రముఖ రెస్టారెంట్ ‘నీలోఫర్ కేఫ్’ ఓనర్ బాబూరావు శ్రీవారికి భారీ కానుకను సమర్పించారు. తాజాగా వడ్డీకాసుల వాడికి వజ్రాలు పొదిగిన బంగారు యజ్ఞోపవీతం సమర్పించి తనదైన విశేషమైన భక్తి చాటారు. కిలోల బంగారంతో, కోటి రూపాయల విలువైన వజ్రాల‌తో తయారైన ప్రత్యేక యజ్ఞోపవీతాన్ని ఆయన తిరుమల తిరుపతి దేవస్థానానికి అందజేశారు.

గతంలో దేవుని దర్శనానికి వెళ్లిన సమయంలో ‘యజ్ఞోపవీతం ఇస్తావా?’ అని దేవుడు అన్నట్టుగా అనిపించడంతో వెంటనే దానిని ప్రత్యేకంగా తయారు చేయించినట్టు బాబూరావు తెలిపారు. ఒక నెల రోజుల్లో పని పూర్తి చేసి, ఎటువంటి ఆలస్యం లేకుండా టీటీడీకి సమర్పించినట్టు చెప్పారు. ఈ వజ్ర బంగారు యజ్ఞోపవీతం మొత్తం విలువ సుమారు నాలుగున్నర కోట్ల రూపాయలుగా అంచనా వేస్తున్నట్టు బాబూరావు వెల్లడించారు. ఆయన చేసిన ఈ అరుదైన సేవ భక్తుల్లో చర్చనీయాంశమైంది.

Next Story