తెలంగాణ డీజీపీకి NHRC నోటీసులు

by Gantepaka Srikanth |

అడ్వొకేట్ జి.స్వప్నకుమారి హత్య కేసులో డీజీపీ శివధర్ రెడ్డికి ఎన్‌హెచ్ఆర్‌సీ నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లో నివేదికను అందించాలని ఆదేశాలలో పేర్కొంది.

తెలంగాణ డీజీపీకి NHRC నోటీసులు
X

దిశ, తెలంగాణ బ్యూరో: అడ్వొకేట్ జి.స్వప్నకుమారి హత్య కేసులో డీజీపీ శివధర్ రెడ్డికి ఎన్‌హెచ్ఆర్‌సీ నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లో నివేదికను అందించాలని ఆదేశాలలో పేర్కొంది. అడ్వొకేట్ రేవంత్ 9వ తేదీన ఫిర్యాదు చేయగా మంగళవారం ఫిర్యాదును పరిశీలించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆదేశాలను అన్లైన్ ద్వారా డీజీపీకి పంపింది. అన్లైన్ ద్వారా జారీ అయిన నోటీసులను పరిగణలోకి తీసుకోవాలని ఎన్‌హెచ్‌ఆర్‌‌సీ పేర్కొంది. ఆస్తి వివాదం కారణంగా ఈ నెల 4వ తేదీన అడ్వొకేట్ స్వప్నకుమారిపై ఆమె సోదరుడు దాడి చేసి హత్య చేశారని, కత్తితో గొంతు కోసినట్లు పిటిషనర్ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుని, పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని కమిషన్‌కు నివేదించారు.

Next Story