- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వేతనాలు లేవు.. ఆదుకోండి : ఎన్‌హెచ్‌ఎం కాంట్రాక్ట్ అండ్ ఔట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ విజ్ఞప్తి
by Ramesh Naini |
సెప్టెంబర్ నుంచి నేటి వరకు వేతనాలు చెల్లించకపోవడంతో తమ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైందని ఎన్ హెచ్ ఎం కాంట్రాక్ట్ అండ్ ఔట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ ఆవేదన వ్యక్తం చేస్తోంది.

X
దిశ, తెలంగాణ బ్యూరో: సెప్టెంబర్ నుంచి నేటి వరకు వేతనాలు చెల్లించకపోవడంతో తమ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైందని ఎన్ హెచ్ ఎం కాంట్రాక్ట్ అండ్ ఔట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ ఆవేదన వ్యక్తం చేస్తోంది. 2026 జనవరి 5 లోపు వేతనాలు చెల్లించి తమను ఆదుకోవాలని ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా ఒక ప్రకటనలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న తమ కుటుంబాలను ఆదుకునేందుకైనా ప్రభుత్వం తమ పట్ల సానుకూలంగా వ్యవహరించి వేతనాలు చెల్లించాలని కోరారు. ఈఎమ్ఐలు, ఇంటి అద్దెలు, కరెంటు బిల్లు, నిత్యావసర వస్తువులు కొనే పరిస్థితి లేకుండా పోయిందని, కుటుంబ పోషణ భారమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. చిరు ఉద్యోగుల పట్ల సానుకూల దృక్పథం చూపించాలని ప్రభుత్వాన్ని కోరారు.
Next Story






