- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ముగిసిన ఇద్దరు ఎమ్మెల్యేల విచారణ.. రేపు స్పీకర్ ముందుకు మరో ఇద్దరు ఎమ్మెల్యేలు
పార్టీ ఫిరాయింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై (MLA Disqualification Case) శనివారం తెలంగాణ..

దిశ, వెబ్‌డెస్క్: పార్టీ ఫిరాయింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై (MLA Disqualification Case) శనివారం తెలంగాణ అసెంబ్లీలోని (Telangana Assembly) స్పీకర్ కార్యాలయంలో విచారణ జరిగింది. ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, సంజయ్ లను స్పీకర్ గడ్డం ప్రసాద్.. పార్టీ ఫిరాయింపులపై ప్రశ్నించారు. ఎమ్మెల్యే కేపీ వివేక్ తరపు న్యాయవాదులు తెల్లం వెంకట్రావును క్రాస్ ఎగ్జామినేషన్ చేయగా.. ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి తరపు లాయర్లు సంజయ్ ను క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, పోచారం శ్రీనివాసరెడ్డిలను నిన్న విచారణ చేసిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యేలు ప్రకాశ్ గౌడ్, కాలే యాదయ్యల విచారణ అక్టోబర్ 1వ తేదీనే పూర్తవ్వగా, అక్టోబర్ 4న గూడెం మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డిల విచారణ పూర్తయింది. అప్పటి నుంచి మిగతా ఆరుగురు ఎమ్మెల్యేల విచారణ వాయిదా పడుతూ వచ్చింది. మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్ లు స్పీకర్ నోటీసులకు వివరణ ఇవ్వాల్సి ఉంది. వీరిద్దరినీ రేపు విచారణ చేయనున్నట్లు సమాచారం.






