- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ ‘టీఆర్ఎస్’ తండ్రి వదులుకున్న పేరుతో కవిత ప్లాన్ వర్కౌట్ అయ్యేనా?
తెలంగాణ రాజకీయాల్లో కవిత పెట్టబోయే కొత్త పార్టీ పేరు ఇప్పుడు చర్చ నీయాశంగా మారింది.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాజకీయాలు ఆసక్తిని రేపుతున్నాయి. రాబోయే శాసనసభ ఎన్నికల కోసం ప్రధాన పార్టీలు ఇప్పటి నుంచే కార్యాచరణను సిద్ధం చేసుకుంటున్నాయి. దశలవారీగా ప్రజల వద్దకు వెళ్తూ తమ ఆలోచను ప్రజలకు వివరించేలా ప్రణాళికలు వేసుకుంటున్నాయి. ఈ క్రమంలో మాజీ సీఎం కేసీఆర్ కూతురు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) కొత్త పార్టీ అంశం (New Political Party) హాట్ టాపిక్ అవుతోంది. ఈ నెల 25వ తేదీన కొత్త పార్టీని అనౌన్స్ చేయబోతున్నట్లు కవిత ఇప్పటికే ప్రకటించగా ఆమె పెట్టబోయే పార్టీ పేరుపై కొత్త చర్చ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది.
పాత ఉద్యమ పార్టీ కొత్త ఎజెండాతో..
బీఆర్ఎస్‍తో తెగతెంపులు జరిగాక కవిత రాజకీయ ప్రస్థానం ఎలా ఉండబోతోంది అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కూతురు కావడంతో ఆమె తీసుకోబోయే నిర్ణయంపై అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో తాను కొత్త రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు చెప్పిన కవిత ఆ మేరకు కసరత్తును వేగవంతం చేశారు. అయితే నిన్న మొన్నటి వరకు కవిత కొత్త పార్టీ పేరుతెలంగాణ ప్రజా జాగృతి అనే ప్రచారం జరుగగా తాజాగా బిగ్ ట్విస్ట్ వినిపిస్తోంది. కేసీఆర్ వదిలేసిన టీఆర్ఎస్ (TRS) పేరు కలిసి వచ్చేలా కవిత తన నూతన రాజకీయ మార్గానికి బాటలు వేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. దీంతో పాత ఉద్యమ పార్టీ పేరుతో కొత్త రాజకీయ అజెండాతో కవిత చేయబోతో పాలిటిక్స్ రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు దారి తీస్తుందో అనే ఉత్కంఠ నెలకొంది.
బీఆర్ఎస్‍కు బిగ్ షాక్?:
జరుగుతున్న ప్రచారం ప్రకారం టీఆర్ఎస్ పేరుతో కవిత పార్టీని స్థాపిస్తే ఇది బీఆర్ఎస్‍ను భారీగా దెబ్బ తీసే అవకాశం ఉండనుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్‍లో ఉన్న అసంతృప్త నేతలంతా కవిత టీమ్ లోకి చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. బీఆర్ఎస్‍లో అవకాశాలు దక్కని వారంతా కవిత వెంట నడిస్తే అది గులాబీ పార్టీ ఓటు బ్యాంకుపై భారీగా ప్రభావం చూపే అవకాశం లేకపోలేదనే చర్చ జరుగుతోంది. ఇక కవితకు ఉద్యమ కాలం నాటి నుంటి యాక్టివ్ పాలిటిక్స్ సాగిస్తున్న కవిత రాబోయో రోజుల్లో ఎలాంటి వ్యూహాలతో రాబోతున్నారు? ఆమె రాకతో ఎవరికి డ్యామేజ్? మరెవరికి మైలేజ్ రాబోతోంది అనేది కాలమే సమాధానం చెప్పనుంది.






