- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
"దమ్ముంటే పట్టుకోండి" అన్నోడిని అరెస్ట్ చేశారు: సీపీ సజ్జనార్‌కు సీవీ ఆనంద్ కంగ్రాట్స్
దమ్ముంటే నన్ను పట్టుకోండి అని ఛాలెంజ్ చేసిన వ్యక్తిని ఎట్టకేలకు అరెస్ట్ చేసిన హైదరాబాద్ సిటీ పోలీస్, డీసీపీ కవిత, సైబర్ క్రైమ్ పోలీసుల్ని రాష్ట్ర హోంశాఖ స్పెషల్ సీఎస్ సీవీ ఆనంద్ అభినందించారు.

దిశ, వెబ్‌డెస్క్: దమ్ముంటే నన్ను పట్టుకోండి అని ఛాలెంజ్ చేసిన వ్యక్తిని ఎట్టకేలకు అరెస్ట్ చేసిన హైదరాబాద్ సిటీ పోలీస్, డీసీపీ కవిత, సైబర్ క్రైమ్ పోలీసుల్ని రాష్ట్ర హోంశాఖ స్పెషల్ సీఎస్ సీవీ ఆనంద్ అభినందించారు. ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని అరెస్ట్ చేయడంపై ఆయన ఆనందం వ్యక్తం చేశారు. సీపీ సజ్జనార్, సైబర్ క్రైమ్ డీసీపీ కవితకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలుపుతూ ఎక్స్ లో ట్వీట్ చేశారు. హ్యాకర్లు డిజిటల్ కంపెనీల సర్వర్లను హ్యాక్ చేసి, ఒరిజినల్ సినిమా కాపీలను తమ వెబ్ సైట్లలో రిలీజ్ చేయడం ద్వారా హై లెవల్ HD సినిమా పైరసీ ప్రెస్ మీట్ ప్రొసీడింగ్స్ ను తిరిగి పోస్ట్ చేస్తున్నట్లు ట్వీట్ లో పేర్కొన్నారు. దీనివల్ల సినీ ఇండస్ట్రీకి భారీ నష్టం వాటిల్లిందన్నారు. ఈ ఏడాది జూన్ నుంచి ఐబొమ్మ నిర్వాహకుడిని అరెస్ట్ చేసేందుకు సైబర్ క్రైమ్ రేయింబవళ్లు కష్టపడిందన్నారు. రవిని తప్ప ఈ పైరసీకి సంబంధించిన వారందరినీ పట్టుకున్నామన్న సీవీ ఆనంద్.. దమ్ముంటే తనను పట్టుకోవాలని ఛాలెంజ్ చేసిన రవిని అరెస్ట్ చేసిన పోలీస్ బృందానికి అభినందనలు తెలిపారు.






