క్రమంగా నమ్మకం లేకుండా పోతోంది: బీజేపీ ఎమ్మెల్యే

by Gantepaka Srikanth |

రాష్ట్రంలో రోజురోజుకూ ప్రైవేటు విద్యాసంస్థలు పెరిగిపోతున్నాయని.. తల్లిదండ్రులు సైతం తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలల్లో చదివించేందుకు ఆసక్తి చూపుతున్నారని సిర్పూర్ కాగజ్ నగర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ అన్నారు.

క్రమంగా నమ్మకం లేకుండా పోతోంది: బీజేపీ ఎమ్మెల్యే
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో రోజురోజుకూ ప్రైవేటు విద్యాసంస్థలు పెరిగిపోతున్నాయని.. తల్లిదండ్రులు సైతం తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలల్లో చదివించేందుకు ఆసక్తి చూపుతున్నారని సిర్పూర్ కాగజ్ నగర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్(Palvai Harish) అన్నారు. శుక్రవారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రభుత్వ విద్యాసంస్థలపై నమ్మకం లేకుండాపోతున్నదన్నారు. 57 శాతం పిల్లలు ప్రైవేటు స్కూళ్లకే వెళ్తున్నారని చెప్పారు. 363 ప్రైవేటు ప్రొఫెషనల్ ఇన్‌స్టిట్యూషన్లు ఉంటే.. ప్రభుత్వానికి సంబంధించి కేవలం 27 మాత్రమే ఉన్నాయన్నారు. దీనిని ఆసరాగా చేసుకొని ప్రైవేటు యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా ఫీజులు పెంచుతున్నాయని అన్నారు. చట్టాన్ని పూర్తిగా తుంగలో తొక్కి డబ్బులు సంపాదిస్తున్నారని ఆరోపించారు. కొత్త యూనివర్సిటీల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు మినహాయింపులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీనికి మంత్రి దామోదర రాజనర్సింహా స్పందిస్తూ.. రాష్ట్రంలో ఓ వైపు ప్రభుత్వ రంగ సంస్థలను బలోపేతం చేస్తూనే ప్రైవేటు సంస్థలను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. క్వాలిటీ ఎడ్యుకేషన్ అంశంలో ప్రభుత్వం బాధ్యతతో ఉన్నదని చెప్పారు.

Next Story