‘వారిని ఉరి తీయాలి’.. ఉగ్రదాడి ఘటనపై హైకోర్టు అడ్వకేట్ల నిరసన

by Jakkula.Mamatha |   (  Updated:2025-04-23 15:36:15  IST  )

కాశ్మీర్ పహాల్గంలో అమాయక పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు

‘వారిని ఉరి తీయాలి’.. ఉగ్రదాడి ఘటనపై హైకోర్టు అడ్వకేట్ల నిరసన
X

దిశ, తెలంగాణ బ్యూరో: కాశ్మీర్ పహాల్గంలో అమాయక పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు పలువురు హైకోర్టు న్యాయవాదులు తెలిపారు. ఈ క్రమంలో ఉగ్ర దాడికి పాల్పడిన ఉగ్రవాదులను ఉరి తీయాలని హైకోర్టు అడ్వకేట్ అసోసియేషన్ కమిటీ ( హెచ్ ఏఏసీ) అధ్యక్షుడు జగన్ డిమాండ్ చేశారు. చనిపోయిన వారికి నివాళులర్పించారు. శ్రద్ధాంజలి ఘటిస్తూ అసోసియేషన్ హాల్ లో రెండు నిమిషాలు మౌనం పాటించారు.

అనంతరం హైకోర్టు అసోసియేషన్ కమిటీ సభ్యులు న్యాయవాదుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున న్యాయవాదులు బార్ కౌన్సిల్ గేటు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా హెచ్ ఏఏసీ సభ్యులు మాట్లాడుతూ ముందు ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని కేంద్ర ప్రభుత్వాన్ని , జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. టెర్రరిజాన్ని అంతమొందించే వరకు అడ్వకేట్స్ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తామన్నారు.

Next Story