‘నీతి ఆయోగ్‌’లో కొత్త టీమ్ ఖరారు: వైస్ చైర్‌పర్సన్‌గా డాక్టర్ అశోక్ లాహిరి

by Kema Shiva Kumar |   (  Updated:2026-04-25 02:44:14  IST  )

‘నీతి ఆయోగ్’ కొత్త టీమ్ కొలువుదీరింది. సీనియర్ ఆర్థికవేత్త డాక్టర్ అశోక్ లాహిరి వైస్ చైర్‌పర్సన్‌గా, మాలిక్యులర్ సైన్స్ ప్రొఫెసర్ డాక్టర్ గోబర్ధన్ దాస్ సభ్యుడిగా నియమితులయ్యారు.

‘నీతి ఆయోగ్‌’లో కొత్త టీమ్ ఖరారు: వైస్ చైర్‌పర్సన్‌గా డాక్టర్ అశోక్ లాహిరి
X

దిశ, వెబ్‌డెస్క్: భారత ప్రభుత్వ థింక్ ట్యాంక్ ‘నీతి ఆయోగ్’ (NITI Aayog)లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. నీతి ఆయోగ్ కొత్త వైస్ చైర్‌పర్సన్‌గా ప్రముఖ ఆర్థికవేత్త డాక్టర్ అశోక్ లాహిరి (Ashok Lahiri), సభ్యుడిగా ప్రఖ్యాత శాస్త్రవేత్త డాక్టర్ గోబర్ధన్ దాస్‌ (Gobardhan Das)లు నియమితులయ్యారు.

ఆర్థిక రంగ నిపుణుడు.. డాక్టర్ అశోక్ లాహిరి

నాలుగు దశాబ్దాలకు పైగా సుదీర్ఘ అనుభవం ఉన్న డాక్టర్ అశోక్ లాహిరి దేశంలోని అత్యంత సీనియర్ ఆర్థికవేత్తలలో ఒకరుగా ఉన్నారు. ఆయన గతంలో భారత ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారుగా (CEA), ఫైనాన్స్ కమిషన్ సభ్యునిగా సేవలందించారు. అదేవిధంగా ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ADB), ప్రపంచ బ్యాంక్ (World Bank), అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) వంటి అంతర్జాతీయ సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించిన అనుభవం ఆయనకు ఉంది. ఇక నీతి ఆయోగ్ సభ్యునిగా ఎంపికైన డాక్టర్ గోబర్ధన్ దాస్ మూడు దశాబ్దాలుగా మాలిక్యులర్ సైన్స్‌ ప్రొఫెసర్‌గా విశేష గుర్తింపు పొందారు. ఇమ్యునాలజీ, అంటు వ్యాధులు, సెల్ బయాలజీ విభాగాల్లో ఆయన పేరుగాంచారు. సైన్స్, టెక్నాలజీ రంగాల్లో ఆయనకున్న అపార జ్ఞానం దేశ విధాన రూపకల్పనలో కీలక పాత్ర పోషించనుంది.

Next Story