- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TG: బాధ్యతలు స్వీకరించిన గురుకులాల కొత్త కార్యదర్శి.. కీలక సూచనలు చేసిన మంత్రి అడ్లూరి
తెలంగాణ గురుకుల విద్యాలయాల(Telangana Gurukul Vidyalayas) సంస్థకు నూతన కార్యదర్శిగా కృష్ణ ఆదిత్య(Krishna Aditya) నియామకం అయిన విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ గురుకుల విద్యాలయాల(Telangana Gurukul Vidyalayas) సంస్థకు నూతన కార్యదర్శిగా కృష్ణ ఆదిత్య(Krishna Aditya) నియామకం అయిన విషయం తెలిసిందే. గురువారం హైదరాబాద్‌లోని డీఎస్ఎస్ భవన్‌లో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సిబ్బందికి పలు సూచనలు చేశారు. విద్యార్థుల విద్యా ప్రగతి, శిక్షణా ప్రమాణాల పెంపుపై మరింత దృష్టి సారించాలని, ప్రతీ ఉద్యోగి బాధ్యతను సమగ్రంగా నిర్వర్తించాలని చెప్పారు. పరిపాలనలో పారదర్శకత, క్రమశిక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. సమయ పాలన ఖచ్చితంగా పాటించాలన్నారు. అనంతరం తెలంగాణ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌ని సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలసి పుష్పగుచ్ఛం అందజేశారు.
ఈ సందర్భంగా గురుకులాలపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్(Adluri Laxman Kumar) పలు సూచనలు చేశారు. మంత్రి మాట్లాడుతూ.. గురుకుల విద్యాలయాల విద్యార్థులు జాతీయ స్థాయిలో ప్రతిభ చాటుకునేలా ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలని, ఉపాధ్యాయులు, సిబ్బంది సమన్వయంతో విద్యార్థులకు స్నేహపూర్వక వాతావరణం కల్పించాలని అన్నారు. ప్రతీ విద్యార్థి ఉన్నత లక్ష్యాలను సాధించేందుకు ప్రోత్సహించే విధంగా అకాడమిక్ కార్యక్రమాలు అమలు చేయాలని సూచించారు. కొత్త కార్యదర్శికి మంత్రి శుభాకాంక్షలు తెలుపుతూ, విద్యా ప్రమాణాల పెంపు దిశగా కృషి చేయాలని ఆకాంక్షించారు.






