- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇందిరమ్మ బిల్లుల చెల్లింపులో నయా రికార్డ్.. ఒక్క వారంలో రూ.252.87 కోట్లు రిలీజ్
రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే. అమలులో ఎక్కడా లబ్ధిదారులకు ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నది. అయితే.. అదే స్థాయిలో బిల్లుల చెల్లింపులు సైతం పూర్తవుతున్నాయి. పథకం ప్రారంభమై ఆరు నెలలు అవుతుండగా.. ఇప్పటివరకు లబ్ధిదారుల ఖాతాల్లో రూ.2,23 3 కోట్లు జమ చేశారు. మరోవైపు.. క్షేత్రస్థాయిలో ఇళ్ల నిర్మాణాలు సైతం జోరుగా సాగుతున్నాయి.
ఒక్క వారంలో రూ.252 కోట్లు చెల్లింపు
ఇళ్ల లబ్ధిదారులకు ప్రభుత్వం వెంటవెంటనే బిల్లులు చెల్లిస్తున్నది. లబ్ధిదారులకు ఈ ఒక్క వారమే రూ.252.87 కోట్లు విడుదల చేశారు. కాగా.. ఇంతవరకు రూ.2,233.21 కోట్లను విడుదల చేసి లబ్ధిదా రుల ఖాతాల్లో జమ చేసినట్లు అధికారులు చెప్పారు. ఇంటి నిర్మాణ పనులను బట్టి ప్రతి సోమవారం నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి నిధులను విడుదల చేస్తుండగా.. ఒక్క వారమే రికార్డు స్థాయిలో లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయడం గమనార్హం. ఒక వా రంలో ఇంత పెద్ద మొత్తాన్ని విడుదల చేయడం ఇదే మొదటిసారి. ఈ నిధులను 22,305 మంది లబ్ధిదారుల ఖాతాల్లో జమచేసినట్లు తెలిపారు.
చకచకా నిర్మాణాలు
రాష్ట్రవ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. ప్రస్తుతం సుమారు 2.18 లక్షల ఇండ్ల పనులు వివిధ దశల్లో ఉన్నాయి. మొత్తంగా రూ.2,233.21 కోట్లు చెల్లించగా.. బేస్‌మెంట్ స్థాయిలో పూర్తయిన 1,43,963 ఇండ్లకు రూ.1439.63 కోట్లు, రూఫ్ లెవల్‌లో పూర్తయిన 46,206 ఇళ్లకు రూ.462.06 కోట్లు, శ్లాబ్ లెవల్‌లో పూర్తయిన 16,576 ఇళ్లకు రూ.331.52 కోట్లు చెల్లింపులు చేశారు. వెంటవెంటనే బిల్లులు చెల్లింపులు జరుగుతుండడంతో లబ్ధిదారులు సైతం ఇళ్ల నిర్మాణాల్లో వేగం పెంచారు.






