వ్యవసాయ సాగులో కొత్త పద్దతులు పాటించాలి : రైతు కమిషన్​ చైర్మన్ ​కోదండరెడ్డి

by Muthe.Rajitha |

నగరంలో గత మూడు రోజులుగా జరుగుతున్న రైతు మహోత్సవానికి రాష్ట్ర నలుమూల నుంచి రోజుకు వందలాది మంది రైతులు తరలివస్తున్నారు.

వ్యవసాయ సాగులో కొత్త పద్దతులు పాటించాలి : రైతు కమిషన్​ చైర్మన్ ​కోదండరెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో : నగరంలో గత మూడు రోజులుగా జరుగుతున్న రైతు మహోత్సవానికి రాష్ట్ర నలుమూల నుంచి రోజుకు వందలాది మంది రైతులు తరలివస్తున్నారు. అగ్రి, హార్టీ కల్చర్​శాఖలు ఏర్పాటు చేయడంతో రైతు కమిషన్​చైర్మన్​ కోదండరెడ్డి పలు స్టాల్​ను ఆదివారం సందర్శించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ దూరప్రాంతాల నుండి వచ్చిన రైతుల వివరాలు, వారు సాగుచేసే పంటల సమాచారం, వాతావరణ పరిస్థితులు, ప్రభుత్వ పనితీరు అడిగి తెలుసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి రైతుల సంక్షేమం దృష్టిలో పెట్టుకొని పాలన సాగిస్తున్నారని, ఇప్పటి వరకు చేపట్టిన పథకాల్లో రైతులకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చిన విషయాలను గుర్తుచేశారు. తెలంగాణ ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వమని, రైతులు దైర్యంగా ఉండాలన్నారు.

వ్యవసాయంలో యాంత్రికరణను జోడించాలని పురుగుమందులు, రసాయనాల వాడకం తగ్గించి పంటలు సేంద్రియ పద్ధతుల్లో సాగుచేయాలని సూచించారు. రైతులకు ఏకకంలో 2 లక్షల రుణమాఫీ, సన్నాలకు 500 రూపాయల బోనస్, రైతు భరోసా, ఆత్మీయ భరోసా లాంటి పథకాలు అన్నదాతకోసమే వచ్చినట్లు చెప్పుకొచ్చారు. భూసార పరీక్షలు చేసిన తర్వాతే దానికి తగ్గట్టుగా పంటలు సాగుచేయాలన్నారు. వాణిజ్య పంటలు కాకుండా ఎక్కువగా ఉద్యానవన పంటలవైపు రైతులు మొగ్గు చూపాలన్నారు.

Next Story