CM Revanth Reddy: సీఎం రేవంత్‌తో కర్మన్‌ఘాట్ టెంపుల్ నూతన పాలకమండలి భేటీ

by Ramesh Naini |

ఇటీవల హైదరాబాద్‌లోని కర్మన్‌ఘాట్ హానుమాన్ టెంపుల్‌లో నూతన పాలకమండలిని ఎన్నుకున్న విషయం తెలిసిందే.

CM Revanth Reddy: సీఎం రేవంత్‌తో కర్మన్‌ఘాట్ టెంపుల్ నూతన పాలకమండలి భేటీ
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: ఇటీవల హైదరాబాద్‌లోని (Karmanghat Hanuman Temple) కర్మన్‌ఘాట్ హానుమాన్ టెంపుల్‌లో నూతన పాలకమండలిని ఎన్నుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)తో భేటీ వారు అయ్యారు. శనివారం జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఆలయ నూతన పాలకమండలి చైర్మన్ ఈదులకంటి సత్యనారాయణ, సభ్యులు, ఆలయ ఈవో లావణ్య, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి గౌడ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కర్మన్‌ఘాట్ హనుమాన్ దేవాలయ అర్చకులు ఆశీర్వచనాలు అందించారు. ఈ మేరకు నూతన పాలకమండలి సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు.

Next Story