- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అక్కడ కొత్తగా అంబేద్కర్ నాలెడ్జ్ టవర్.. బడ్జెట్‍లో ప్రకటించిన భట్టి
హైదరాబాద్‌లో అంబేద్కర్ నాలెడ్జ్ టవర్ నిర్మాణం, ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ బకాయిల విడుదలపై బడ్జెట్‌లో భట్టి విక్రమార్క కీలక ప్రకటనలు చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ లోయర్ ట్యాంక్ బండ్ వద్ద కొత్తగా డా.బి.ఆర్ అంబేద్కర్ నాలెడ్జ్ టవర్‍ను (BR Ambedkar Knowledge Tower) నిర్మించబోతున్నట్లు ప్రభుత్వ ప్రకటించిది. ఇవాళ బడ్జెట్ (Telangana Budget 2026) స్పీచ్‍లో భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) ఈ విషయాన్ని స్పష్టం చేశారు. రూ.368 కోట్ల27 లక్షల అంచనా వ్యయంతో 910 ఎస్సీ కమ్యూనిటీ హాళ్లు/అంబేద్కర్ భవనాలు/ విగ్రహాలు మంజూరు చేశామని తెలిపారు. అలాగే నింబోలి అడ్డ కాచిగూడలో బాబూ జగ్జీవన్ రామ్ పేరుతో నూతన వసతి గృహాన్ని నిర్మిస్తారమని పేర్కొన్నారు. అంతరాలు లేని సమాజం కోసం మా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల సామాజిక న్యాయం చేయాలనేది మా ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం అన్నారు. వసతి పాఠశాలలు, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల ద్వారా ఎస్సీ, ఎస్టీలకు ఉద్యోగావకాశాలు కల్పించడానికి కృషి చేస్తున్నట్లు చెప్పారు.
ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ అమలుపై..
ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం అమలుపై రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఇవాళ శాసనసభలో 2026-27 వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తన ప్రసంగంలో కీలక ప్రకటన చేశారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టాన్ని సంపూర్ణంగా అమలు చేయడానికి మా ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని అన్నారు. మేము అధికారంలోకి వచ్చే సమయంలో 2023-24 ఆర్థిక సంవత్సరం నాటికి సబ్ ప్లాన్ చట్ట ప్రకారం ఖర్చు చేయాల్సిన నిధులలో ఎస్సీలకు చెందిన రూ.13 ,617 కోట్లు, ఎస్టీలకు చెందిన 1,317 కోట్లు కలిసి మొత్తం 14,934 కోట్లు ఖర్చు కాకుండా ఉందన్నారు. మా ప్రభుత్వం గత ఆర్థిక సంవత్సరంలో చేసిన కేటాయింపులతో పాటు ఈ బకాయిలను కూడా అదనంగా కేటాయించామన్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఈ క్యారీ ఫార్వర్డ్ చేయవలసిన నిధులు, ఎస్సీలకు రూ7,757 కోట్లు, ఎస్టీలకు రూ.1,754 కోట్లు ఖర్చు చేయవలసి ఉంది. వాటిని మేము 2026-27 ఆర్థిక సంవత్సరంలో కేటాయించాల్సిన మొత్తానికి అదనంగా 2024-25 ఆర్థిక సంవత్సరానికి చెందిన బకాయిలను కూడా కేటాయిస్తున్నామన్నారు.






