Ravindra Jadeja నాకు ఇలాంటి అమ్మాయే కావాలి.. జడేజా భార్య సంప్రదాయంపై నెటిజన్స్ రియాక్షన్

by Prasad Jukanti |   (  Updated:2025-03-12 06:02:57  IST  )

టీమిండియా క్రికెటర్ జడేజా భార్య మరోసారి సోషల్ మీడియాలో వైరల్ గా మారారు.

Ravindra Jadeja నాకు ఇలాంటి అమ్మాయే కావాలి.. జడేజా భార్య సంప్రదాయంపై నెటిజన్స్ రియాక్షన్
X

దిశ, డైనమిక్ బ్యూరో: భారత క్రికెటర్ రవీంద్ర జడేజా (Jadeja) భార్య రివాబా జడేజా మరోసారి సోషల్ మీడియాలో వైరల్ గా మారారు. ఇటీవల ఛాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy) ఫైనల్ లో న్యూజిలాండ్ ను టీమ్ ఇండియా చిత్తు చేసిన సంగతి తెలిసిందే. ఈ విజయం అనంతరం టీమిండియా (Team India) ఆటగాళ్లు తమ కుటుంబ సభ్యులతో సంతోషాన్ని పంచుకున్నారు. ట్రోఫీతో ఫోటోలు దిగారు. ఈ సందర్భంగా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా తన భార్య రివాబా జడేజా (Rivaba Jadeja), కూతురుతో కలిసి ట్రోఫీతో ఫోటోలు దిగారు. అయితే విదేశాల్లో జరిగిన ఈ అంతర్జాతీయ మ్యాచ్ కు సంప్రదాయబద్ధంగా చీరలో వచ్చిన జడేజా భార్య రివాబా అందరి దృష్టిని ఆకర్షించారు. నెటిజన్లు ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. రివాబాను చూస్తుంటే ముచ్చటేస్తుంది. భారత సంప్రదాయాలు, సమాజంలోని విలువలను నిలబెట్టే ఆదర్శాలను ఆమె ప్రోత్సహిస్తున్నారనంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. అయితే @Sri4TDP అనే నెటిజన్ 'నాకు ఇలాంటి అమ్మాయే కావాలి' అని పోస్టు చేశారు. ఈ పోస్టుకు స్పందించిన మిగతా నెటిజన్లు నువ్వు జడేజా లాంటి అబ్బాయి అయితే అలాంటి అమ్మాయే వస్తుంది లే అంటూ ఫన్నీ రిప్లయ్ లు ఇస్తున్నారు. కాగా రివాబా 2022 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో జామ్‌నగర్ నార్త్ నుంచి బీజేపీ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు. కాగా పలు వేదికలపై రివాబా తన భర్త జడేజా పాదాలను తాకి ఆశీర్వాదం తీసుకోవడం, కట్టుబొట్టుతో నెటిజన్ల ప్రశంసలు పొందుతోంది. ఇదే సమయంలో మరికొందరు నెటిజన్లు విమర్శలు కూడా చేస్తున్నారు. జడేజాను ఆమె పెళ్లి చేసుకున్నాక జడేజా తన తండ్రి తరఫు కుటుంబంతో విభేదాలు మొదలయ్యాయనినే విమర్శలూ ఉన్నాయి.

Next Story