- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Hyderabad: చలాన్లపై కాదు ట్రాఫిక్ పై దృష్టి పెట్టండి..హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులపై నెటిజన్ల ఆగ్రహం
హైదరాబాద్ లో ట్రాఫిక్ జామ్ పరిస్థితులపై నెటిజన్లు మండిపడుతున్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ (Hyderabad Traffic) పరిస్థితి పై నెటిజన్లు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ట్రాఫిక్ జామ్ తో Traffic Jam) వాహనదారులు గంటల తరబడి ఇబ్బందులు పడుతున్నా అధికారులెవరూ పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. ప్రతి రోజు ఇదే పరిస్థితి ఉంటోందని హైదరాబాద్ ట్రాఫిక్ బాస్ రియలైజ్ కావాల్సిన సమయం ఇదేనంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు హైదరాబాద్ ట్రాఫిక్ పరిస్థితిపై ఓ వాహనదారుడు వీడియో తీయగా ఈ వీడియో క్లిప్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో సదరు వాహనదారుడు మాట్లాడుతూ.. మధ్యాహ్నం 12:.37 గంటలకు మారేడ్ పల్లి వద్ద అన్ని రూట్లలో ట్రాఫిక్ జామ్ అయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిరోజు ఇదే పరిస్థితి ఉందని ట్రాఫిక్ పోలీసులు కేవలం సిటీ ఫ్లైఓవర్, ఎయిర్ పోర్టు ఫ్లైఓవర్, గ్రీన్ చానల్ వాటిని మాత్రమే మేనేజ్ చేస్తున్నారని ఆరోపించారు. ట్రాఫిక్ మేనేజ్ సరిగా చేయలోకపోవడం వల్ల వాహనదారులు గంటల కొద్దీ తమ విలువైన సమయం, ఇంధనం వృథా అవుతోంది. ఇకనైనా హైదరాబాద్ ట్రాఫిక్ బాస్ రియలైజ్ కావాలి. ట్రాఫిక్ పోలీసుల విధి పెండింగ్ లో ఉన్న చలాన్లు కలెక్ట్ చేయడం మాత్రమే కాదు. ట్రాఫిక్ ను కూడా మేనేజ్ చేయాలి. కానీ చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ట్రాఫిక్ పరిస్థితి ఇలాగే ఉంటోంది. ఈ విషయంలో ఎవరైనా కోర్టుకు వెళ్లాలి. ట్రాఫిక్ పరిస్థితి ఇలా ఉంటే ఇప్పుడే మరోవైపు ఓ మంత్రి వెళ్తుంటే పోలీసులు గ్రీన్ చానల్ ఏర్పాటు చేశారు. అంబులెన్స్, ఫైరింజన్స్ కు మాత్రమే సైరన్ ఉపయోగించాలని సుప్రీంకోర్టు నిబంధనలు ఉన్నాపోలీసు సిబ్బంది వాటిని ఉల్లంఘిస్తూ మంత్రికి సైరన్ తో ఎలా ఎస్కార్ట్ చేస్తారని ప్రశ్నించారు. ఈ వీడియోను ఓ నెటిజన్ ఎక్స్ లో షేర్ చేయగా పలువురు నెటిజన్లు స్పందించారు.
రద్దీ ఉండే రోడ్లపై బారికేడ్లు ఏంటో?:
ఈ వీడియోపై స్పందించిన ఓ నెటిజన్.. రద్దీగా ఉండే జాతీయ రహదారులైన బండ్లగూడ, బహదూర్‌పురా ప్రధాన రహదారులపై పెండింగ్‌లో ఉన్న చలాన్‌లు, మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారిని తనిఖీ చేసేందుకు బారికేడ్లను ఏర్పాటు చేస్తున్నారని ఓ నెటిజన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో నెటిజన్ స్పందిస్తూ ట్రాఫిక్ పోలీసులు చలాన్ల కోసం ఫోటోలు తీయడంలో బిజీగా ఉంటున్నారని కామెంట్ చేయగా మరో నెటిజన్ గత నెల 27న ఎక్స్ లో ఓ పోస్టు చేస్తూ కూకట్ పల్లి నుంచి అమీర్ పేట్ వెళ్లే రూట్ లో ప్రతిరోజు భారీగా ట్రాఫిక్ జామ్ అవుతున్నదని ఓవీడియో పోస్టు చేశారు. మరో నెటిజన్ స్పందిస్తూ భారత దేశంలో 99 శాతం మంది డ్రైవర్లకు ట్రాఫిక్ అవగాహన లేదని వారు డ్రైవింగ్ నియమాలు పాటించనంత వరకు ఎటువంటి పోలిసింగ్ కూడా ఈ పరిస్థితిని తగ్గించదంటూ కామెంట్ చేశారు. ఇదిలా ఉంటే నగరంలో ట్రాఫిక్ పరిస్థితులపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు మాత్రం సోషల్ మీడియాలో ట్రాఫిక్ అప్ డేట్స్ ఎప్పటికప్పడు అందిస్తూ వాహనదారులను అలర్ట్ చేస్తున్నారు. మేజర్ ఇష్యూతో ట్రాఫిక్ జామ్ ఏర్పడితే వెంటనే అందుకు గల కారణాన్ని వివరిస్తూ పోస్టులు చేస్తున్నారు.






