CPI MLC Candidate : సీపీఐ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నెల్లికంటి సత్యం

by Muthe.Rajitha |   (  Updated:2025-03-09 17:14:14  IST  )

తెలంగాణ(Telangana)లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల(MLA Quota MLC Elections)కు రేపటితో నామినేషన్ ప్రక్రియ ముగుస్తుండగా పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటిస్తున్నారు.

CPI MLC Candidate : సీపీఐ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నెల్లికంటి సత్యం
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ(Telangana)లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల(MLA Quota MLC Elections)కు రేపటితో నామినేషన్ ప్రక్రియ ముగుస్తుండగా పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటిస్తున్నారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో సంఖ్యాబలం ప్రకారం కాంగ్రెస్ పార్టీకి 4 స్థానాలు దక్కగా.. అందులో తన మిత్రపక్షం అయిన సీపీఐ(CPI)కి ఒక స్థానాన్ని కేటాయిస్తున్నట్టు ఆదివారం తెలిపింది. కాంగ్రెస్ అధిష్టానం చేసిన ఈ ప్రకటన అనంతరం సీపీఐ కార్యవర్గం సమావేశం అయ్యి తమ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి(CPI MLC Candidate)గా నెల్లికంటి సత్యాన్ని(Nellikanti Satyam) ప్రకటించింది. కాగా ఇప్పటికే కాంగ్రెస్, బీఆర్ఎస్ వర్గాలు తమ అభ్యర్థులను ప్రకటించగా.. తాజాగా సీపీఐ కూడా తమ అభ్యర్థిని వెల్లడించింది. కాంగ్రెస్ అభ్యర్థులుగా విజయశాంతి, అద్దంకి దయాకర్, కేతావత్ శంకర్ నాయక్ లను బరిలో నిలబెడుతుండగా.. బీఆర్ఎస్ దాసోజు శ్రవణ్ కుమార్ ను నిలబెదుతోంది. కాగా ఈ ఎన్నికలకు రేపటితో నామినేషన్ గడువు ముగుస్తుండగా.. ఈనెల 20న ఎన్నిక జరగనుంది. అదేరోజు సాయంత్రం ఓట్ల లెక్కింపు జరిపి విజేతలను ప్రకటిస్తారు.

Next Story